స్టాక్మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే...
By: chandrasekar Sat, 05 Sept 2020 1:23 PM
శుక్రవారం నాటి ట్రేడ్‌లో భారత స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టాలు కలిగాయి. బ్యాంకింగ్, ఫార్మా, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్
633.76 పాయింట్లు నష్టపోయి
38,357.18 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ
193.6 పాయింట్లు కోల్పోయి
11,333.9 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.13 వద్ద కొనసాగుతున్నది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభ౦ కావడంతో ఆరంభంలోనే సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ 170 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను కొనసాగించింది.
ప్రపంచ ఆర్థికవ్యవస్థ కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న విశ్లేషణలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో ఆసియా మార్కెట్లు రెండు వారాల కనిష్ఠానికి పడిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. ఒకనొక దశలో
38,249 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయిన సూచీ ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నా చివరకు నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్‌లో 1002షేర్లు లాభపడ్డాయి. 1674 షేర్లు నష్టపోయాయి. 177 షేర్లలో ఎలాంటి మార్పులేదు. మారుతీ సుజుకీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్ తదితర షేర్లు లాభపడగా, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ తదితర షేర్లు నష్టపోయాయి.