Advertisement

  • అక్కిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్ విడుదల

అక్కిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్ విడుదల

By: Sankar Sun, 25 Oct 2020 2:08 PM

అక్కిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్  బ్యాచిలర్  టీజర్ విడుదల


మంచి హిట్ సినిమా కోసం చాల కాలంగా ఎదురుచూస్తున్న అక్కినేని యువ వారసుడు హీరోగా , లాంగ్ గ్యాప్ తర్వాత స్టార్ డైరెక్టర్ బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో హిట్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్.. నిజానికి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమా.. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి వాయిదా పడింది.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ లిరికల్ సాంగ్ విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో తాజాగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ టీజర్ ను విడుదల చేసారు. టీజర్ లో అఖిల్ స్మార్ట్ గా కనిపిస్తున్నాడు .. ఇక బుట్టబొమ్మ పూజా హెగ్డే అందంతో కట్టిపడేసింది. టీజర్ చూస్తుంటే సినిమా ప్రేక్షకులను మెప్పించేలానే కనిపిస్తుంది కనిపిస్తుంది .

ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. పోస్టర్లు టీజర్ ఆకట్టుకున్నట్టే మొత్తం సినిమా కూడా బ్లాక్ బస్టర్ అన్న టాక్ రావాలి మరి.ఇక సినిమాను 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. .

Tags :
|

Advertisement