కేంద్రం కీలక నిర్ణయం... రేపు అర్ధరాత్రి నుంచి విమానాల సర్వీసులు రద్దు...!
By: Anji Mon, 21 Dec 2020 4:35 PM
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నుంచి వచ్చే అన్ని రకాల విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది.
డిసెంబర్ 31 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పౌర విమానయాన శాఖ సోమవారం (డిసెంబర్ 21) ఒక ప్రకటనలో తెలిపింది. రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది.
యూకే నుంచి ఇప్పటికే బయల్దేరిన, మంగళవారం అర్దరాత్రి 12 గంటల లోపు ఆయా విమానాల ద్వారా ఇక్కడికి చేరుకోనున్న ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులలో పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారని విమానయాన శాఖ తెలిపింది.
ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. ప్రయాణికులు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది.
Tags :
flights |