అహ్మదాబాద్ వేదికగా ఇండియా -ఇంగ్లాండ్ మధ్య డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్
By: Sankar Wed, 21 Oct 2020 12:45 PM
కరోనా కారణంగా వచ్చిన బ్రేక్ తర్వాత క్రికెటర్లు మళ్ళీ బిజీ అయ్యారు ఒకవైపు ఐపీయల్ రసవత్తరంగా సాగుతుంటే మరివైపు టీమిండియా తర్వాత ఆడే సిరీస్ విషయాలు కూడా జరుగుతున్నాయి..నవంబర్ 10న ఈ లీగ్ ముగిసిన వెంటనే ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది భారత జట్టు.
ఈ పర్యటనలో ఆ జట్టుతో టెస్ట్ సిరీస్ అలాగే రెండు పరిమిత ఓవర్ల సిరీస్ లు కూడా ఆడనుంది. అనంతరం భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ తో తలపడుతుంది టీం ఇండియా. వచ్చే ఏడాది జనవరి-మార్చి లో ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటిస్తుంది. అందులో భాగంగా ఈ రెండు జట్లు 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తలపడనున్నాయి. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగే డే-నైట్ పింక్ బాల్ టెస్టు మ్యాచ్ కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.
మిగత మ్యాచ్ లు నిర్వహించాల్సిన వేదికల పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అని అన్నాడు. కరోనా కారణంగా, ప్రస్తుతం ఐపీఎల్ 2020 జరుగుతున్న యూఏఈ లోనే బీసీసీఐ ఈ ఇంగ్లాండ్ సిరీస్ ను నిర్వహిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ బీసీసీఐ భారతదేశంలోనే ఇంగ్లాండ్‌కు ఆతిథ్యం ఇవ్వాలని నిశ్చయించుకుంది.