బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య ఒప్పందం
By: chandrasekar Wed, 07 Oct 2020 4:59 PM
పాట్నా: బీహార్ అసెంబ్లీ
ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఈ కూటమికి
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యం వహించనున్నారు. అందరూ ఊహించినట్లుగానే 50:50
సీట్లను బీజేపీ, జేడీయూ పంచుకున్నాయి. 243 అసెంబ్లీ సీట్లుకు గాను
జేడీయూ 122 సీట్లను, బీజేపీ
122
సీట్లను పంచుకున్నాయి. అయితే జేడీయూ వాటాలోని 7సీట్లను మరో భాగస్వామ్య పక్షమైన జీతన్ రామ్ మాంఝీ
నేతృత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చాకు కేటాయించున్నట్లు సీఎం నితీశ్ కుమార్
చెప్పారు. మంగళవారం సీట్ల పంపకాల అనంతరం నితీశ్ కుమార్ ఎన్డీయే పక్షాలతో కలిసి
మీడియాతో మాట్లాడారు. 115 స్థానాల నుంచి జేడీయూ పోటీ చేస్తుందని తెలిపారు. తమ
వాటాలోని మరో ఏడు స్థానాల్లో హిందుస్థాన్ అవామ్ మోర్చాకు కేటాయించినట్లు
పేర్కొన్నారు. 121 స్థానాల నుంచి బీజేపీ పోటీ చేయనున్నట్లు
తెలిపారు. అయితే ఈ సమావేశంలో తమతో
అనుబంధాన్ని తెంచుకున్న లోక్ జన శక్తి పార్టీపై నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం
చేశారు. జేడీయూ సాయం లేకుండా రామ్ విలాస్ పాశ్వాన్ రాజ్యసభకు వెళ్ళారా ? ఆ
పార్టీకి ఉన్న స్థానాలు ఎన్ని అంటూ విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం ఆయన
అనారోగ్యంతో బాధపడుతున్నారని, త్వరగా కోలుకోవాలంటూ కోరారు. యూపీఏ కూటమి నుంచి బయటకు
వచ్చిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ బీజేపీ
మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చలు విజయవంతమైతే బీజేపీ తన వాటాలోని కొన్ని స్థానాలను వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి కేటయించనుంది.
రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28, నవంబర్
3,7
తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రెండురోజుల క్రితమే యూపీఏకు
చెందిన మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. మహాకూటమిలోని ఆర్జేడీ 144 స్థానాల్లో, కాంగ్రెస్
70, సీపీఐ(ఎంఎల్)
19, సీపీఐ 6, సీపీఎం
4
స్థానాల్లో బరిలో దిగనున్నాయి. అయితే ఈ మహాకూటమికి రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు
తేజస్వి యాదవ్ రథసారధిగా
వ్యవహరించనున్నారు.