జైల్లో నటి రియా ఆమె సోదరుడు మరియు పని మనిషిని విచారించుటకు కోర్టు అనుమతి
By: chandrasekar Fri, 25 Sept 2020 08:53 AM
సుశాంత్ సింగ్ మరణం
తరువాత డ్రగ్స్ కేసులు పై విచారణ మరింత పుంజుకుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్
మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న నార్కోటిక్స్ కంట్రోల్
బ్యూరో (ఎన్సీబీ) నటి రియా చక్రవర్తి, ఆమె
సోదరుడు షోయిక్ చక్రవర్తి, పని మనిషి దీపేశ్ సావంత్‌ను జైలులో విచారించనున్నది.
దీని కోసం ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు ఎన్సీబీకి గురువారం అనుమతి ఇచ్చింది.
వీరిని విచారించడం ద్వారా మరిన్ని విషయాలు బయట పడవచ్చని తెలుస్తుంది. అనతి కాలంగా
బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా గురించిన విషయాలు బయట పడ్డ సంగతి అందరికి తెలిసిందే.
దీంతో జ్యుడిషియల్
రిమాండ్ నేపథ్యంలో తలోజా జైలులో ఉన్న ఈ ముగ్గురి స్టేట్‌మెంట్లను ఎన్సీబీ
అధికారులు మరోసారి అక్కడ రికార్డు చేయనున్నారు. మరోవైపు సుశాంత్ ఈవెంట్ మేనేజర్
జయాను ఎన్సీబీ ఇటీవల ప్రశ్నించింది. ఆమె చెప్పిన వివరాలు, ఆమె
వాట్సాప్ గ్రూప్‌లో లభించిన చాటింగ్ సమాచారం మేరకు బాలీవుడ్ తారలు దీపిక, సారా
అలీఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్
ప్రీత్‌ను ప్రశ్నించేందుకు ఎన్సీబీ వారికి సమన్లు జారీ చేసింది. తొలుత రకుల్
ప్రీత్‌ను ఎన్సీబీ అధికారులు శుక్రవారం విచారించనున్నారు.