జిల్లాలో దారుణ... పండ్లు అమ్ముకునే ఓ మహిళపై యాసిడ్ దాడి...!
By: Anji Sat, 12 Dec 2020 5:36 PM
కర్ణాటక బెళగావి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పండ్లు అమ్ముకునే ఓ మహిళపై దుండగుడు యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు.
తీవ్ర గాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది ఆ మహిళ. జిల్లాలోని రాయబాగ పట్టణం ఝండ కట్టె గ్రామంలో పండ్లు విక్రయిస్తూ జీవినం సాగిస్తోంది యాస్మీన్ తహసీస్దార్ (35).
రోజు మాదిరిగానే పండ్లు అమ్ముకుంటుండగా అక్కడికి చేరుకున్న దుండగుడు ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో మహిళ పొట్ట, మెడ బాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.
ఆమె అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు నీటిని చల్లి.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
అయితే.. యాసిడ్ దాడికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దుండగుడి కోసం గాలింపు చేపట్టారు రాయబాగ పోలీసులు.