ఏబీ డివిలియర్స్, డానియెల్లీ దంపతులకు పండంటి బిడ్డ
By: chandrasekar Fri, 20 Nov 2020 7:41 PM
ఏబీ డివిలియర్స్ మరియు
డానియెల్లీ దంపతులకు పండంటి బిడ్డ పుట్టింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా
పోయింది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విధ్వంసకర
బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ సతీమణి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని
డివిలియర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నవంబర్ 11న తన
భార్య డానియెల్లీ ఓ పాపకు జన్మనిచ్చిందని తెలిపారు. దీంతో తను మరోసారి తండ్రి
అయినట్లు తెలిపాడు. ఈ పాపకు యెంటే డివిలియర్స్‌గా నామకారణం చేసినట్లు వివరించాడు.
తమకు కలిగిన ఈ సంతానానికి
వీరు ఇరువురూ చాలా సంతోష పడ్డారు. ఈ పాపతో కలిపి డివిలియర్స్, డానియెల్లీ
దంపతులకు మూడో సంతానం. 2013లో వారిద్దరికి వివాహం జరగగా అబ్రహం డివిలియర్స్, జాన్
రిచర్డ్ డివిలియర్స్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. తాజాగా ఈ దంపతులకు ఆడపిల్ల
పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దంపతులు ఇద్దరూ కుతూరితో కలిసి
దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు డివిలియర్స్. ఇది సోషల్ మీడియాలో
వైరల్ గా మారింది.