ఎబి హిట్టింగ్ దెబ్బకు స్టేడియం బయట పడిన బంతులు
By: Sankar Tue, 13 Oct 2020 1:30 PM
కోల్‌కతాపై బెంగళూరు జట్టు భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఏబీ డివీలియర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తిచేశాడు. 77(33) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సులు బాదాడు. రెండు సిక్సులు ఏకంగా స్టేడియం బయటకు వెళ్లాయి.
ఐతే 16వ ఓవర్‌లో కేకేఆర్ బౌలర్ వేసిన నాలుగో బంతికి భారీ షాట్ ఆడగా, బంతి స్టేడియం బయటకు వెళ్లి ఒక కారుకు తగిలింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో స్టేడియం బయట రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయినట్టు కనిపిస్తుంది. 'దటీజ్ ఏబీ' అంటూ నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏబీ సిక్సు కొట్టడం వల్లే ట్రాఫిక్ జామ్ అయిందని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
కాగా బెంగళూరు నిర్దేశించిన 194 భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా విఫలమయ్యారు. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా బెంగుళూరు జట్టు 84 పరుగుల భారీ విజయాన్ని నమోదుచేసుకొని పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.