Advertisement

మహారాష్ట్రలో పులిదాడి చేయడంతో యువకుడు మృతి

By: chandrasekar Fri, 04 Dec 2020 5:42 PM

మహారాష్ట్రలో పులిదాడి చేయడంతో యువకుడు మృతి


మహారాష్ట్రలో పులిదాడి చేయడంతో యువకుడు మృతి చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా కేమారా గ్రామానికి చెందిన యువకుడిపై పులిదాడి చేసి హతమార్చింది. కేమారా గ్రామానికి చెందిన సుజాత్ నెవారే (18) ఉదయం పోంభూర్ణ తహసీల్‌ పరిధిలో బుధవారం మధ్యాహ్నం పులి గొర్రెల మేపేందుకు వెళ్లాడు.

గొర్రెలు మేపుతున్న అతనిపై పొదల్లో ఉన్న పులి అనుకోకుండా దాడిచేసి ఆ యువకుడిని హతమార్చింది. నెవారే తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామస్తులు సాయంతో గాలించగా అతని మృతదేహం బయపడింది. అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

ఇక్కడ చోటుచేసుకున్న పులి దాడిలో మరణించిన యువకుని కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అందించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ఏడాది జిల్లాలో పులిదాడిలో 23 మంది, చిరుత దాడిలో నలుగురు అడవి పంది దాడిలో మరొకరు మొత్తం 28 మంది మృత్యువాతపడ్డారు. ఇలా జంతువుల దాడిలో మృతువాత పడడం చాలా ఘోరమని బాధిత కుటుంబాలు తెలిపారు.

Tags :
|

Advertisement