తెలంగాణ రాష్ట్ర జైళ్ల అధ్యయనానికి పంజాబ్ అధికారుల బృందం
By: chandrasekar Fri, 18 Dec 2020 11:18 AM
తెలంగాణ రాష్ట్రం జైళ్లలో
ఏర్పరచిన సౌకర్యాలు మరియు వాటి స్థితిగతులను పరీక్షించుటకు పంజాబ్ అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుంది.
ఇందుకోసం పంజాబ్ రాష్ట్రానికి చెందిన జైళ్లశాఖ మంత్రి ఎస్‌హెచ్. సుక్జిందర్
ఎస్ రంధ్వా నేతృత్వంలో అధికారుల బృందం గురువారం చెర్లపల్లి కేంద్ర కారాగారాన్ని
మరియు ఓపెన్ ఎయిర్ జైలును తనికీచేసారు.
ఈ సమయంలో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ పంజాబ్ జైళ్లశాఖ మంత్రికి 'చార్మినార్' మెమెంటోను
బహూకరించారు.
జైళ్లలో ఖైదీలకు అవసరమైన
అన్ని సదుపాయాలు అందుబాటుపై పర్యవేక్షించారు. ఖైదీలు శిక్ష సమయంలో చదువుకొనుటకు
అన్ని సౌకర్యాలను ఏర్పరచినట్లు హోమ్ మంత్రి తెలిపారు. ఖైదీలు శిక్షను అనుభవించే
సమయంలో వారు పనిచేయుటకు పరిశ్రమలను కూడా
ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరిశ్రమలలో శిక్షణ కూడా అందిస్తున్నట్లు
తెలిపారు. వీరికి శిక్షా కాలం పూర్తయిన తరువాత ఉపాధి కోసం జైళ్లశాఖ ఆధ్వర్యంలో
నిర్వహించ బడుతున్న పెట్రోల్ బంకుల్లో అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
జైళ్లల్లో పరిశుభ్రత మరియు ఆహార వసతుల పై కూడా అధ్యయనం చేశారు.