తెలంగాణా ఎడ్‌సెట్ ఫలితాల్లో 97.58 శాతం ఉత్తీర్ణత
By: chandrasekar Thu, 29 Oct 2020 09:31 AM
తెలంగాణాలో బీఈడీ
కాలేజీలో చేరుట కోసం ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. బీఈడీ కాలేజీల్లో
సీట్ల భర్తీ కోసం ఈ నెల 1 మరియు 3 తేదీల్లో నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు
విడుదలయ్యాయి. ఇందులో 97.58 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని
ఉన్నతవిద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
ఇందులో అడ్మిషన్ ల కోసం
మొత్తం 30,600 మంది పరీక్షకు హాజరుకాగా,
29,861 మంది అర్హత పొందారని వెల్లడించారు. బుధవారం
ఉస్మానియా యూనివర్సిటీలో ఫలితాలను విడుదల చేసిన ఆయన త్వరలోనే కౌన్సెలింగ్
నిర్వహిస్తామని చెప్పారు. ఫలితాలను ఎడ్‌సెట్-2020 అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పేర్కొన్నారు.
ఎడ్‌సెట్ ఫలితాల విడుదల
కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ఎడ్‌సెట్
కన్వీనర్ ప్రొఫెసర్ టీ మృణాళిని, ఉన్నతవిద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్
లింబాద్రి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చాలా
మంది టీచర్ పోస్టులపై మక్కువ చూపుతున్నారు.