ఉత్తరాఖండ్ సచివాలయానికి కరోనా సెగ..
By: Sankar Tue, 08 Sept 2020 3:52 PM
కరోనా మహమ్మారి దెబ్బకు ఉత్తరాఖండ్ సచివాలయంలో 8 విభాగాలు మూసివేశారు.. కరోనా కేసులు పెరుగుతున్న ఓ వైపు క్రమంగా అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది సర్కార్.. మరోవైపు.. కరోనా తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారు..
ఇక, ఉత్తరాఖండ్ సచివాలయంలో తాజాగా మరో నలుగురు సిబ్బంది కరోనాబారినపడ్డారు. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి కూడా కరోనా బాధితుల్లో ఉన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. సచివాలయంలోని ఎనిమిది విభాగాలను మూసివేశారు. అధికారుల నిర్ణయంతో ఆరోగ్యశాఖ విభాగం కూడా ఇవాళ మూసివేశారు. సచివాలయం సిబ్బందికి కరోనావైరస్ సోకడంతో ఇటీవలే సందర్శకులతోపాటు మీడియా సిబ్బందిని కూడా లోనికి అనుమతించడం నిలిపివేయగా.. అయినా కేసులు ఆగకపోవడంతో.. ఎనిమిది విభాగాలను మూసివేశారు అధికారులు.
కాగా, ఉత్తరాఖండ్‌లో కోవిడ్ -19 కేసులు సోమవారం 25 వేల మార్క్‌ను క్రాస్ చేశాయి.. 807 మందికి కరోనా నిర్ధారణ కాగా, మరో ఏడుగురు మృతిచెందారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 17,046 మంది కోవిడ్ రోగులు కోలుకోగా, ప్రస్తుతం 7,965 యాక్టివ్ కేసులున్నాయి.