Advertisement

  • బరేలి సబ్ జైల్లో ఒకే రోజు 67 మందికి కరోనా పాజిటివ్

బరేలి సబ్ జైల్లో ఒకే రోజు 67 మందికి కరోనా పాజిటివ్

By: Sankar Tue, 21 July 2020 3:23 PM

బరేలి సబ్ జైల్లో ఒకే రోజు 67 మందికి కరోనా పాజిటివ్



మధ్యప్రదేశ్‌లోని సబ్‌ జైలులో ఒకే రోజు భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రైసెన్‌ జిల్లాలోని బరేలి సబ్‌ జైలులో సోమవారం 67 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 64 మంది జైలు ఖైదీలు, ముగ్గురు హోంగార్డులకు వైరస్‌ సోకింది.

ఈ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మంగళవారం వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్, పర్యవేక్షణ సిబ్బంది సహా మిగిలిన 11 మంది సిబ్బందిని కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ జైళ్ల డీజీ సంజయ్‌ చౌదరి మాట్లాడుతూ కొవిడ్‌ పాజిటివ్‌గా గుర్తించిన 22 మంది ఖైదీలు, సిబ్బందిని పొరుగున ఉన్న విదిషా జిల్లాలోని మెడికల్‌ కళాశాలకు తరలిస్తున్నామని, మిగతా వారిని బరేలి జైలులో ఉంచి వైద్యసేవలందించనున్నట్లు తెలిపారు.

కాగా, 82 మంది ఖైదీలున్న జైలులో 67 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. కొత్తగా చేరిన ఖైదీల కారణంగా వైరస్‌ వ్యాపించిన ట్లు అధికారులు భావిస్తున్నారు. సబ్‌ జైలులోని ఖైదీలు దగ్గు, జలుబు, జ్వరం తదితర కొవిడ్‌-19లక్షణాల కారణంగా బాధపడుతుండగా ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. సోమవారం అధికారులు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. జైళ్లలో రికార్డు స్థాయిలో 67 మందికి వైరస్‌ సోకింది. ఇంతకు ముందు ఫిబ్రవరి - మార్చి నుంచి సెంట్రల్‌ ఇండియన్‌ స్టేట్‌ వ్యాప్తంగా జైళ్లలో 80-90 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో సుమారు 40 కేసులు ఇండోర్‌లో నమోదయ్యాయి.

Tags :
|
|
|
|

Advertisement