Breaking: అమ్మ కోసం వచ్చి.. ఆరుగురు చేతిలో..!
By: Anji Sun, 15 Nov 2020 5:41 PM
దేశంలో వేర్వేరు చోట్ల అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. అసోంలో ఇద్దరు యువతులపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహారాష్ట్రలోనూ ఓ పాఠశాల బాలికపై ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు.
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఓ పాఠశాల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఫేస్బుక్లో పరిచయమైన భూషణ్ మాడియే అనే వ్యక్తే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఈ నెల 12న కలవాలంటూ ఫోన్ చేసి బాలికను పిలిపించాడు. అనంతరం లాడ్జ్కు తీసుకెళ్లి తన స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ దారుణాన్ని రికార్డు చేసి... విషయాన్ని ఎవరికైనా చెప్తే, వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని ఆ బాలికను బెదిరించాడు. అయితే బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.