నవంబర్ 19న రియల్‌మి నుంచి 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్...
By: chandrasekar Tue, 17 Nov 2020 3:02 PM
రియల్‌మి 7
స్మార్ట్‌ఫోన్ 5G సాంకేతికతతో పనిచేసే గురించి గత కొన్ని రోజులుగా
వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 19న
మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రియల్‌మి 7
5G డివైజ్‌ను వర్చువల్ ఈవెంట్ ద్వారా బ్రిటన్‌లో లాంచ్
చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఆ సంస్థ గతంలో కూడా వర్చువల్ ఈవెంట్‌లోనే వివిధ
ఉత్పత్తులను లాంచ్ చేసింది. రియల్‌మి అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ
వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్‌ను యూరోపియన్ మార్కెట్లోకి నవంబర్ 19న ఉదయం
10
గంటలకు (భారతదేశంలో 3:30 PM) విడుదల చేస్తామని పోస్ట్ చేశారు. ఆ సంస్థ నుంచి
ఇప్పటికే రియల్‌మి 7, 7 ప్రో, 7 ఐ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. తాజా ఫోన్‌కు 5G సపోర్ట్
ఉంటుంది. అభిమానులు, వినియోగదారులు ట్విట్టర్, ఫేస్‌బుక్, సంస్థ
అధికారిక యూట్యూబ్ ఛానెల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం
ద్వారా చూడవచ్చని రియల్‌మి ప్రకటించింది.
ఫీచర్లు...
రియల్‌మి 7 సిరీస్‌లో వచ్చిన ఇతర స్మార్ట్‌ఫోన్‌ల
మాదిరిగానే తాజా రియల్‌మి 7 5G ఫీచర్లు ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
5G సపోర్ట్,
90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5
అంగుళాల డిస్‌ప్లే, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పంచ్ హోల్ డిజైన్
వంటి ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం.
కెమెరా విభాగంలో 48MP ప్రైమరీ, 8MP సెకండరీ కెమెరా, రెండు 2MP
కెమెరాలతో క్వాడ్-కోర్ సెటప్ ఉంది.
ఆక్టాకోర్ మీడియాటెక్
డైమెన్సిటీ 720 చిప్‌సెట్ ప్రాసెసర్, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5,000 mAh బ్యాటరీ సామర్థ్యంతో రియల్‌మి 7 5Gను
రూపొందించారు.
ఇండియాలో వేరే పేరుతో..
భారతదేశంలో రియల్‌మి 7 5G స్మార్ట్‌ఫోన్‌ను
రియల్‌మి V5 పేరుతో విడుదల చేయనున్నట్లు కొన్ని నివేదికలు
ప్రకటించాయి. RMX2111 మోడల్ నంబర్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ గురించి తాజా
వివరాలను NBTC వెబ్‌సైట్ ప్రచురించింది. గతంలో ఇదే మోడల్ నంబర్‌ను
రియల్‌మి V5కు చెందినదిగా గుర్తించారు. దీంతో ఇది రెండు వేర్వేరు
బ్రాండింగ్‌లతో వస్తున్న ఒకే స్మార్ట్‌ఫోన్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రియల్‌మి 7 5జీ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చే అంశంపై
అధికారిక సమాచారం లేదు. భారత్‌లో విడుదలైతే, ఇది దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ రంగాన్ని మార్చగలదని ఆయా సంస్థలు
అభిప్రాయం.