ఇక నుంచి ఏపీలో ఆ మహిళా ఉద్యోగులకు కూడా ప్రసూతి సెలవులు ..జగన్ సర్కార్ కీలక నిర్ణయం
By: Sankar Sat, 26 Sept 2020 09:00 AM
ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామ-వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.. వారికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణ ఉద్యోగుల తరహాలోనే వారికి 180 రోజుల ప్రసూతి సెలవులు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో విధులు నిర్వహిస్తోన్న గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ప్రసూతి సెలవులను ఇవ్వలేదు. దీంతో వారు కూడా సెలవుల డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. మహిళా ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ నిర్ణయంతో వేల సంఖ్యలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో లబ్ది చేకూరనుంది.. వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.