అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల వల్ల అభం శుభం తెలియని 15 ఏండ్ల బాలిక బలి
By: chandrasekar Mon, 05 Oct 2020 3:21 PM
అన్నదమ్ముల మధ్య ఆస్తి
తగాదాల వల్ల అభం శుభం తెలియని 15 ఏండ్ల బాలిక బలైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో
చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు
పరంపర కొనసాగుతూనే ఉన్నది. అక్కడ ప్రతిరోజు నేరాలు జరుగుతూనే ఉన్నాయి.
అధికంగా నేరాలు ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంటున్నాయి.
ఆస్తి తగాదాలు వల్ల
తాజాగా కాన్పూర్ దెహాత్ ఏరియాలో అన్నదమ్ముల మధ్య అభం శుభం తెలియని 15 ఏండ్ల
బాలిక ప్రాణాలను బలితీసుకున్నాయి. సొంత చిన్నాన్న పెదనాన్నలే బాలికను
దారుణంగా హత్యచేశారు. చేను దగ్గర ఒంటరిగా కనిపించిన బాలికను హతమార్చి అక్కడే
పడేశారు.
చేనులో బిడ్డ మృతదేహాన్ని
చూసిన బాలిక తండ్రి తల్లడిల్లాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. తన
సోదరులకు, తనకు మధ్య భూమి గొడవలు ఉన్నాయని, వాళ్లే
నా బిడ్డను హత్యచేసి ఉంటారని ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు
నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంకా పూర్తి
వివరాలు తెలియాల్సి వుంది.