Advertisement

ఒకే జైలులో 128 మందికి కరోనా పాజిటివ్...

By: Sankar Fri, 24 July 2020 1:12 PM

ఒకే జైలులో 128 మందికి కరోనా పాజిటివ్...ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఝాన్సీ జిల్లా జైలులో 128 మంది ఖైదీల‌కు క‌రోనా సోకింది. దీంతో జైలులోని నాలుగు బ‌రాక్‌ల‌ను క‌రోనా ద‌వాఖాన‌గా మార్చారు. వారికి అందులో చికిత్స అందిస్తున్నారు. గురువారం జైలులోని 748 మందికి ఖైదీల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించామ‌ని, అందులో 126 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

జూలై 9న ఒక ఖైదీకి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో అత‌న్ని జిల్లా ద‌వాఖాన‌కు పంపించామ‌ని, అక్క‌డ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ అని తేలింద‌ని వెల్ల‌డించారు. త‌ర్వాత మ‌రొక‌రికి కూడా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు. దీంతో జైలులో ఉన్న 1,110 మంది ఖైదీల‌కు ర్యాపిడ్ యాంటిజెన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 58,104 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 1289 మంది మ‌ర‌ణించారు. అదేవిధంగా దేశంలో గ‌త 49,310 క‌రోనా కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం కేసుల సంఖ్య‌ 12,87,945కి చేరింది. క‌రోనాతో 30,601 మంది మ‌ర‌ణించారు.

Tags :
|
|

Advertisement