Advertisement

రాజ్ భవన్ లో సిబ్బందికి కరోనా ..

By: Sankar Sun, 12 July 2020 9:13 PM

రాజ్ భవన్ లో సిబ్బందికి కరోనా ..



తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి రాజ్‌భవన్‌కు సైతం చేరింది. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న 10 మంది భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కరోనా పరీక్షల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్‌, ఇతర సీనియర్‌ అధికారులకు నెగిటివ్‌ అని తేలింది. రెడ్‌జోన్లలో కాంటాక్ట్ హిస్టరీ ఉన్నవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. ఈ మేరకు తెలంగాణ రాజ్‌భవన్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

రాజ్ భవన్‌లో మొత్తం 28 మంది భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 10 మందికి పాజిటివ్ అని తేలింది. పాజిటివ్‌గా తేలిన వీరి కుటుంబ సభ్యుల్లోనూ మరో 10 మందికి కరోనా సంక్రమించినట్లు సమాచారం.అయితే గవర్నర్ తమిళసై కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు ..ముందస్తు రోగ నిర్దారణ పరీక్షలు మనల్ని రక్షించడమే కాకుండా ఇతరులను కూడా రక్షిస్తాయన్నారు. సంకోచించొద్దు మీరు పరీక్షలు చేయించుకోండి ఇతరులు చేయించుకునేలా చూడండని అన్నారు. నాలుగు టీ(టెస్ట్‌, ట్రేస్‌, ట్రీట్‌, టీచ్‌) లను పాటించాల్సిందిగా ఆమె పేర్కొన్నారు.

Tags :
|
|
|

Advertisement