Advertisement

ఇమ్మునిటీ ప‌వ‌ర్ పెంచుకోవ‌డం కోసం ఏమి తినాలి

By: chandrasekar Fri, 10 July 2020 6:06 PM

ఇమ్మునిటీ ప‌వ‌ర్ పెంచుకోవ‌డం కోసం ఏమి తినాలి


క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడిస్తున్నది. దేశాలు, రాష్ట్రాలు దాటి గ్రామాల‌కు కూడా వ్యాపించింది. రోగనిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికే ఈ వైర‌స్ సోకుతుంది. మ‌రి ఇమ్మునిటీ ప‌వ‌ర్ పెంచుకోవ‌డం చేయాలి. ఇంగ్లిష్ మందుల‌కు పెట్టే ఖ‌ర్చు మంచి ఆహారానికి పెడితే ఎలాంటి రోగం రాదు. మ‌నం రోజూ తీసుకునే ఆహార ప‌దార్థాల‌తోనే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌చ్చు. అయితే ఆ ఆహార ప‌దార్థాలు, వాటి ఉప‌యోగాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌కూర : ఇందులో ఫొలేట్ దండిగా ఉంటుంది. పాల‌కూరలో పీచు ప‌దార్థం స‌మృద్ధిగా ల‌భిస్తుంది. అంతేకాకుండా విట‌మిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ల‌భిస్తాయి. ఇది శ‌రీరంలో కొత్త క‌ణాల ఉత్ప‌త్తి‌లో పాలు పంచుకుంటుంది.

క్యాబేజీ‌ : దీన్ని కూర రూపంలోనే కాకుండా స‌లాడ్ రూపంలో తీసుకుంటే మ‌రింత మంచిది. ఇది ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను పెంచ‌డ‌మే కాకుండా ర‌క్త‌వృద్ధికి తోడ్ప‌డుతుంది. అంతేకాదు గ్లుట‌మైన్ కూడా ల‌భిస్తుంది.

పుచ్చ‌కాయ : ఎర్ర‌గా, న‌ల్ల‌ని విత్త‌నాల‌తో చూడ‌గానే నోరూరించే పుచ్చ‌కాయ‌లో గ్లూటాథియోన్ అనే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఇది శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్‌ఫెక్ష‌న్లు, జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది.

బాదం : ఇది వ్యాధినిరోధ‌క‌శ‌క్తి త‌గ్గ‌కుండా కాపాడుతుంది. బాదంలో బి విట‌మిన్లు ఒత్తిడి, ఆందోళ‌న వంటి ప్ర‌భావాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. బాదంలో విట‌మిన్ ఇ స‌మృద్ధిగా ల‌భిస్తుంది.

వెల్లుల్లి : కూర‌ల్లో వ‌చ్చే వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసి పారేస్తుంటారు. ఇలా చేస్తే ఆరోగ్యాన్ని కూడా వ‌దిలేసిన‌ట్లే. వెల్లుల్లి అనేక యాంటీ ఆక్సిడెంట్ల‌ను క‌లిగి ఉంటుంది. అంతేకాదు జీర్ణాశ‌యంలో ఏర్ప‌డే పుండ్లు, క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌య్యే కణాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటుంది.

స్వీట్ పొటాటో : చిల‌క‌డ‌దుంప లేదా గెనిసి ‌గ‌డ్డ‌గా పిలిచే దీంట్లో కెరొటిన్లు బాగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క‌ణాల నుంచి ఎదుర‌య్యే అన‌ర్థాల‌ను తొలిగిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా వృద్ధాప్య ఛాయ‌ల‌ను త‌గ్గించే విట‌మిన్ 'ఎ' దండిగా ఉంటుంది.

పెరుగు : కాస్త జ‌లుబు చేసిన‌ట్లు అనిపిస్తే చాలు పెరుగును దూరం పెట్టేస్తారు. రోజూ ఒక క‌ప్పు పెరుగు తింటే తర‌చూ జ‌లుబు బారిన‌ప‌డే అవ‌కాశాలు త‌గ్గుతాయి. జ‌బ్బుల‌తో పోరాడేందుకు రోగ‌నిరోధ‌క శ‌క్తిని ప్రేరేపిస్తుంద‌ని తాజా అధ్య‌యానాల్లో వెల్ల‌డైంది. ఇందులో విట‌మిన్ డి ఉంటుంది. ఇది జ‌లుబు, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ను నివారిస్తుంది.

ఇవి మాత్ర‌మే కాకుండా సిట్ర‌స్ జాతి పండ్లు నిమ్మ‌కాయ‌, ఆరెంజ్‌, బ్రోక‌లి, క్యారెట్‌, పుట్ట‌గొడుగులు, ఓట్స్‌, ఉల్లిగ‌డ్డ‌లు, ప‌సుపు వంటి ఆహార ప‌దార్థాలు కూడా మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి ఉపయోగప‌డుతాయి.

Tags :
|
|

Advertisement