Advertisement

నల్ల ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

By: chandrasekar Wed, 03 June 2020 6:34 PM

నల్ల ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


నల్ల ద్రాక్ష కేవలం రుచికరమైనవే కాదు, మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి. వెల్వెటీ బ్లాక్ కలర్ లో ఉండే బ్లాక్ గ్రేప్స్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ కి నిలయం కూడా. ఈస్ట్ యూరప్ లో పురాతనంగా సాగుచేయబడుతున్న పండుగా బ్లాక్ గ్రేప్స్ ప్రసిద్ధి. బ్లాక్ గ్రేప్స్ లో రెండు జాతులున్నాయి. ఆఫ్ఘానిస్తాన్ లోని బ్లాక్ సీ కి సౌత్ ఈస్ట్ కోస్ట్ అనేది బ్లాక్ గ్రేప్స్ పురాతన జాతుల పుట్టిల్లు. మరోవైపు, కొత్త జాతులు సౌత్ అమెరికా మరియు నార్త్ ఈస్టర్న్ అమెరికాలో ఉద్భవించాయి.

అద్భుతమైన తీయదనంతో జ్యూసీగా ఉండే బ్లాక్ గ్రేప్స్ ని తాజాగా తీసుకోవచ్చు. లేదంటే జ్యూస్ గా తీసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ ని ఎండబెట్టి రైసిన్స్ గా కూడా తీసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ లో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఆకృతిలో అలాగే రుచిలో రెడ్ అలాగే గ్రీన్ గ్రేప్స్ ని పోలి ఉంటాయి. డీప్ బ్లాక్ కలర్ వలన బ్లాక్ గ్రేప్స్ కి ప్రత్యేకమైన రుచి సొంతమైంది. వీటిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

* బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది: బ్లాక్ గ్రేప్స్ ని తీసుకోవడం ద్వారా డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. రెస్వెరాట్రాల్ అనే ఒక రకమైన సహజ ఫెనోల్ బ్లాక్ గ్రేప్స్ లో లభిస్తుంది. ఇది ఇన్సులిన్ సెక్రేషన్ ని అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందించి బ్లడ్ షుగర్ లెవల్స్ ని అదుపులో ఉంచుతుంది.

the,health,benefits,black,grapes ,నల్ల ద్రాక్ష, వల్ల, కలిగే, ఆరోగ్య, ప్రయోజనాలు


* చర్మసంరక్షణకు ఉపయోగపడతాయి: బ్లాక్ గ్రేప్స్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ వలన హానికరమైన అల్ట్రా వయొలెట్ రేస్ నుంచి రక్షణ లభిస్తుంది. బ్లాక్ గ్రేప్స్ లో లభించే విటమిన్ సి మరియు విటమిన్ ఈ వలన స్కిన్ సెల్స్ పునరుజ్జీవనం సులభమవుతుంది. అలాగే, చర్మానికి తగినంత తేమను అందించడానికి కూడా బ్లాక్ గ్రేప్స్ తోడ్పడతాయి.

* శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది: యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు విటమిన్ ఈ బ్లాక్ గ్రేప్స్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి స్కాల్ప్ కి రక్తప్రసరణ సజావుగా జరిగేలా ఏర్పాటు చేస్తాయి. తద్వారా, జుట్టురాలిపోయే సమస్యను అరికట్టడంతో పాటు స్ప్లిట్ ఎండ్స్ ని అలాగే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ను అరికడతాయి. అలాగే, శిరోజాలను మృదువుగా మరియు బలంగా చేస్తూ స్కాప్ పై దురదలు తగ్గించి డాండ్రఫ్ ను తొలగించడంలో ఉపయోగపడతాయి.

* గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి: బ్లాక్ గ్రేప్స్ లో లభ్యమయ్యే ఫైటోకెమికల్స్ అనేవి గుండె కండరాలు దెబ్బతినడాన్ని తగ్గిస్తాయి. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఆ విధంగా, హార్ట్ ఎటాక్ తో పాటు ఇతర కార్డియోవాస్కులర్ వ్యాధుల బారి నుంచి రక్షణను అందిస్తాయి.

the,health,benefits,black,grapes ,నల్ల ద్రాక్ష, వల్ల, కలిగే, ఆరోగ్య, ప్రయోజనాలు


* కంటిచూపును మెరుగుపరుస్తాయి: లూటీన్ మరియు జిగ్జాంథిన్ లనే కరోటినాయిడ్స్ బ్లాక్ గ్రేప్స్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి కంటిచూపును కలిగి ఉండేందుకు తోడ్పడతాయి. బ్లాక్ గ్రేప్స్ ను తీసుకోవడం ద్వారా రెటీనాకు జరిగే ఆక్సిడేటివ్ డేమేజ్ ను అడ్డుకోవచ్చు. తద్వారా, అంధత్వం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

* బ్రెయిన్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది: బ్లాక్ గ్రేప్స్ ని తరచూ తీసుకోవడం ద్వారా ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చు. ఆలాగే, మైగ్రేన్, డిమెన్షియా మరియు అల్జీమర్ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. మెదడును సంరక్షించే ఏజెంట్ గా బ్లాక్ గ్రేప్స్ పనిచేస్తాయి.

* క్యాన్సర్ ని అరికడుతుంది: యాంటీ మ్యూటజెనిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు బ్లాక్ గ్రేప్స్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ లను అరికట్టడంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి. రెస్వెరాట్రాల్ అనే కాంపౌండ్ బ్లాక్ గ్రేప్స్ లో లభిస్తుంది. ఇది కాన్సర్ కారక కణాలను నశింపచేస్తుంది.

the,health,benefits,black,grapes ,నల్ల ద్రాక్ష, వల్ల, కలిగే, ఆరోగ్య, ప్రయోజనాలు


* రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి: విటమిన్ సి, విటమిన్ కే మరియు విటమిన్ ఏ అనే ముఖ్యమైన విటమిన్లు బ్లాక్ గ్రేప్స్ లో పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఫ్లెవనాయిడ్స్ మరియు మినరల్స్ కూడా బ్లాక్ గ్రేప్స్ లో సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ, రోగనిరోధక శక్తిని పెంపొందించే పోషకాలు. ఈ గ్రేప్స్ లో షుగర్ తో పాటూ ఆర్గానిక్ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి మలబద్దకం, అజీర్ణం మరియు కిడ్నీ సమస్యలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

* బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది: యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు బ్లాక్ గ్రేప్స్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన టాక్సిన్స్ ను శరీరం నుంచి బయటకు పంపించేందుకు తోడ్పడతాయి. ఆ విధంగా అదనపు బరువు తగ్గిపోతుంది. బ్లాక్ గ్రేప్స్ లో కేలరీలు తక్కువగా లభిస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు.

* బోన్ లాస్ ను అరికడుతుంది: రెస్వెరాట్రాల్ అనే కాంపౌండ్ బ్లాక్ గ్రేప్స్ లో పుష్కలంగా లభిస్తుంది. ఇది మెటబాలిక్ సిండ్రోమ్ ని అరికడుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ వలన గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. తద్వారా, బోన్ లాస్ కి కారణమవుతుంది మెటబాలిక్ సిండ్రోమ్. బ్లాక్ గ్రేప్స్ ని తినడం ద్వారా ఓస్టియోపోరోసిస్ నుంచి రక్షణ లభిస్తుంది.

Tags :
|
|
|

Advertisement