Advertisement

  • Breaking News: మరో కొత్త వైరస్ విజృంభణ... ఆందోళన చెందుతున్న ప్రజలు...!

Breaking News: మరో కొత్త వైరస్ విజృంభణ... ఆందోళన చెందుతున్న ప్రజలు...!

By: Anji Sat, 26 Dec 2020 4:52 PM

Breaking News: మరో కొత్త వైరస్ విజృంభణ... ఆందోళన చెందుతున్న ప్రజలు...!

గత ఏడాది చివర్లో చైనా నుండి వచ్చిన కరోనా ఇప్పటివరకు వదిలి పెట్టలేదు. ఆ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఇప్పటికే కోట్లాది మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

ఈ వైరస్ ను అంతం చేసేందుకు టీకాను అభివృద్ధి చేశారు. అత్యవసర వినియోగం కింద ఇప్పటికే వ్యాక్సిన్ ను వినియోగిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వచ్చే సమయానికి మరో కొత్త వైరస్ విజృంభించడం మొదలుపెట్టింది.

కరోనా కొత్త స్ట్రెయిన్ బ్రిటన్ లో మొదలయ్యి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తో పాటుగా ఆసియాలోని జపాన్ లోకి కూడా ఈ వైరస్ ప్రవేశించింది. అమెరికా సైతం ఈ వైరస్ పై ఆందోళన చెందుతున్నది.

బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని, అలా వచ్చిన వారికే దేశంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

కొత్త స్ట్రెయిన్ 70శాతం వేగంగా విస్తరిస్తుండటమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. చూడాలి మరి ఇది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావం చేస్తుంది అనేది.

Tags :
|
|
|

Advertisement