Advertisement

రాత్రి పూట చపాతీ తింటే మంచిదా

By: chandrasekar Sat, 13 June 2020 11:03 AM

రాత్రి పూట చపాతీ తింటే మంచిదా


అన్నం, చపాతీ భారతదేశంలోని ఏ మూలకు వెళ్లినా ఈ రెండు ఆహారంలో భాగంగా ఉంటాయి. సౌత్ ఇండియాలో అన్నం ఎక్కువగా తింటారు. చపాతి తక్కువగా తీసుకుంటారు. అదే నార్త్ ఇండియా వైపు వెళ్తే చపాతీ ఎక్కువగా తీసుకుంటారు. అన్నం తక్కువగా తింటారు. ఏదిఏమైనా అన్నం, చపాతీ అనేవి భారతీయుల డైట్ లో భాగమైపోయాయి. చాలా మంది రాత్రి పూట అన్నం కు బదులుగా చపాతీ మంచిది అని చెబుతారు. వీటిలో ఏది మంచిది? అనే విషయంపై ఇప్పటికీ చాలామందికి రకరకాల సందేహాలున్నాయి. ఏది ఆరోగ్యకరమైనది అన్న విషయంపై పోషకాహార నిపుణులు చెబుతున్నది.

వరి అన్నం కంటే గోధుమ పిండిలో ప్రొటీన్లు నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటాయి. మూడు రెట్లు ఎక్కువగా కార్బొహైడ్రేట్లు, 10 రెట్లు అధికంగా పొటాషియం ఉంటాయి. వరి అన్నం కంటే గోధుమల్లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. అంటే రక్తంలో గ్లూకోజ్‌ పెరగకుండా ఇది సహకరిస్తుంది. వరి అన్నం కంటే రోటీలో ఆరు రెట్లు అధికంగా ఫైబర్‌ ఉంటుంది. దీనివల్ల అరుగుదల నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలిని తెలియనీయదు. అన్నంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి.

మధుమేహవ్యాధి ఉన్నవారిని ఇవి ఇబ్బందులకు గురిచేస్తాయి. గోధుమలో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి. ఊబకాయంతో బాధపడుతున్న వారు, లావు తగ్గాలని కోరుకుంటున్న వారు రాత్రి సమయంలో అన్నం మానేయడం చాలా మంచి పద్దతి. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సలహాలిస్తున్నారు. దీంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు.

చపాతి తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చపాతిని చాలా తక్కువ నూనేతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనే వేయకుంటే మరింత మంచిది. ప్లేట్‌ నిండుగా భోజనం చేసినా ఒకటే, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతి శరీరానికి అధిక శక్తినిస్తుందని నిరూపితం అయ్యింది.

better,to eat,chapati,on nights,oil ,రాత్రి, పూట, చపాతీ ,తింటే, మంచిదా


గోదుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. వాటిల్లో ఎక్కువగా విటమిన్‌ బి, ఇ, కాపర్‌, అయోడిన్‌, జింక్‌, మాంగనీస్‌, సిలికాన్‌, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోదుమల్లో ఐరన్‌ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. పని ఒత్తిడిలో ఏ అర్దరాత్రో భోజనం చేసి వెంటనే నిద్రిస్తారు. కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి,నిద్ర పోవడానికి మధ్య గ్యాప్ ఉంటే బాగుంటుంది. చపాతి కూడా ఎక్కువగా తినకూడదు. ప్రతి రోజు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వరి అన్నం కంటే గోధుమ పిండిలో ప్రొటీన్లు నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటాయి. మూడు రెట్లు ఎక్కువగా కార్బొహైడ్రేట్లు, 10 రెట్లు అధికంగా పొటాషియం ఉంటాయి. వరి అన్నం కంటే గోధుమల్లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. అంటే రక్తంలో గ్లూకోజ్‌ పెరగకుండా ఇది సహకరిస్తుంది. వరి అన్నం కంటే రోటీలో ఆరు రెట్లు అధికంగా ఫైబర్‌ ఉంటుంది. దీనివల్ల అరుగుదల నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలిని తెలియనీయదు. అన్నంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహవ్యాధి ఉన్నవారిని ఇవి ఇబ్బందులకు గురిచేస్తాయి. గోధుమలో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి.

రాత్రివేళ జీర్ణక్రియ వ్యవస్థ నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల రాత్రి వేళ చపాతీలు తినడమే బెటరన్న వాదన వినిపిస్తోంది. బరువు తగ్గాలనుకునేవారు చపాతీలను ఎక్కువ నూనె కాకుండా తక్కువ నూనెతో కాల్చుకోవాలి. అసలు నూనె వెయ్యకుండా కూడా చేసుకోవచ్చు. అన్నం కంటే చపాతీ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి రెండు లేదా మూడు చపాతీలు మాత్రమే తినాలి. చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. పైగా గోధుమల్లో ఐరన్ ఎక్కువ కాబట్టి… రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అది గుండెకు మేలు చేస్తుంది. అయితే రాత్రి 7 తర్వాత 10 లోపే తింటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు.

Tags :
|
|

Advertisement