Advertisement

  • ఈ ఆరు పోష‌కాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం

ఈ ఆరు పోష‌కాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం

By: chandrasekar Thu, 10 Sept 2020 09:14 AM

ఈ ఆరు పోష‌కాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం


ప్రస్తుతం కరోనా ఇమ్మ్యూనిటి సమస్యలవల్ల తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. మ‌నిషి మాన‌సికంగా ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహార‌మే స‌హాయ‌ప‌డుతుంది. ఈ ఆరు పోష‌కాలు ఉన్న ఆహారం తీసుకుంటే చాలు ఆరోగ్యం గురించి ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. త‌క్కువ ఆహారం తీసుకునే వారిలో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి 12, క్యాల్షియం, ఐర‌న్‌, ఫోలెట్, విట‌మిన్ డి వంటి పోష‌కాలు లోపిస్తాయి. అందుకే పోష‌కాహార ప్రాముఖ్య‌త గురించి అందరూ గుర్తించాలి. ఈ ముఖ్యమైన పోషకాలు ఏ ఆహారంలో ఎక్కువ‌గా దొరుకుతాయో చూస్తాము.

* ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెద‌డుకు మేలు చేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. దీనిలోపం వ‌ల్ల నిరాశ‌, ఆందోళ‌న, దృష్టిలోపం వంటి వాటికి దారి తీస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సార్డినెస్‌, సాల్మ‌న్‌, మాకేరెల్ వంటి చేప‌ల ద్వారా ల‌భిస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ నుండి కూడా అధికంగా దొరుకుతుంది.

* జింక్

జింక్ ఆక‌లిని త‌గ్గిస్తుంది. ప‌నులు చేయ‌డానికి కావాల్సిన శ‌క్తిని అందిస్తుంది. మాంసం, చిక్కుళ్లు, తృణ‌ధాన్యాలు, గుడ్లు, పాల ప‌దార్థాలు, కాయ‌లు, విత్త‌నాలు మొద‌లైన వాటి నుంచి జింక్ పుష్క‌లంగా అందుతుంది.

విటమిన్ బి 12

విటమిన్ బి 12 మెద‌డు ప‌నితీరు, ఎర్రర‌క్త క‌ణాల ఉత్ప‌త్తిని నిర్వ‌హించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. మాంసం, చేప‌లు, పాల ఉత్ప‌త్తులు మొద‌లైన వాటిలో విట‌మిన్ బి 12 ల‌భిస్తుంది. ఇది త‌క్కువ స్థాయిలో ఉండ‌కుండా చూసుక‌కోవాలి. నాన్‌వెజ్ తిన‌ని వారు స‌ప్లిమెంట్ల రూపంలో విట‌మిన్ 12ను పొంద‌వ‌చ్చు.

* సెలీనియం

సెలీనియం అనే ముఖ్యమైన ఖనిజం శ‌రీరానికి చాలా అవ‌స‌రం. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ నుంచి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తుంది. చికెన్, టర్కీ, చేపలు, గుడ్లు, కాటేజ్ చీజ్, పాలు,పెరుగు, బ్రెజిల్ కాయలు, బచ్చలికూర, అరటి, పుట్టగొడుగులు మొదలైన వాటి నుంచి సెలీనియం దొరుకుతుంది.

* మెగ్నీషియం

మెగ్నీషియం శ‌రీరానికి చాలా అవ‌స‌రం. ఇది త‌క్కువ స్థాయిలో ఉండ‌కుండా చూసుకోవాలి. దీనివ‌ల్ల భ‌యాందోళ‌న‌లు, నిద్ర‌లేమి, చిరాకు వంటి స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. ఆకుకూర‌లు, తృణ‌ధాన్యాలు, చిక్కుళ్లు, కాయ‌లు, విత్త‌నాలు, డార్క్ చాక్లెట్స్‌, చేప‌లు వంటి వాటిలో మెగ్నిషియం స‌మృద్దిగా దొరుకుతుంది.

* విటమిన్ డి

విటమిన్ డి న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి అవసరం. ఇది త‌క్కువ‌గా ఉంటే నిరాశ‌, ఆందోళ‌న‌, ఇత‌ర మాన‌సిక ఆరోగ్య ల‌క్ష‌ణాలకు దారితీస్తుంది. విట‌మిన్ డి వ‌ల్ల దంతాలు, ఎముక‌లు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది గుడ్డుసొన‌, చేప‌లు, జున్ను, తృణ‌ధాన్యాలు మొద‌లైన వాటి నుంచి పుష‌ల్కంగా ల‌భిస్తుంది.

Tags :
|
|

Advertisement