Advertisement

కరక్కాయను వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

By: Sankar Sun, 26 July 2020 11:21 AM

కరక్కాయను వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు



అనేక రోగాలకు దివ్యౌషధాలు మన వంటింట్లోని పోపుల పెట్టెలోనే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది కరక్కాయ. కరక్కాయను సంస్కృతం లో హరిటకి అంటారు.ఇది వాతగుణాలను తగ్గించి, బుద్ధిని వికసింపజేస్తుంది. అంతేకాదు శక్తినిచ్చి, ఆయుష్షును పెంచుతుంది. ఉప్పు తప్ప అన్ని రుచులు దీనిలో ఉంటాయి. మలబద్దకాన్ని నివారించడానికి సరైన ఔషధం. అలాగే పైల్స్‌పై కూడా ప్రభావం చూపుతుంది..కరక్కాయను వాడటం కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇపుడు చూదాం ..

1. కరక్కాయ పెంకులు, వస ఆకులు కలిపి రెండు రోజులు నానబెట్టాలి. తర్వాత వీటిని ఎండబెట్టి పొడిచేసి పూటకు అర టీస్పూన్ చొప్పున నేరుగా లేదా తేనెతో కలిపి తీసుకుంటే అవయవాల్లో అంతర్గత రక్తస్రావం ఆగుతుంది.

2. కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసి, అర టీస్పూన్ చొప్పున రోజుకు మూడుసార్లు తేనె లేదా నీటిలో కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది.

3. ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు అరచెంచాడు కరక్కాయ చూర్ణాన్ని వేడినీళ్లతో గాని లేదా తేనె, నెయ్యి మిశ్రమంతోగాని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

4. కరక్కాయ, శొంఠి కలిపి చూర్ణం చేసి బెల్లం కలిపి నిల్వచేసుకొని రోజుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగితే మలబద్ధకం తగ్గుతుంది.

5. కరక్కాయ, శొంఠి మిశ్రమానికి బెల్లం కలిపి, రోజుకు రెండుసార్లు అర చెంచాడు చొప్పున మజ్జిగతోపాటు తీసుకుంటే శరీరంలో చేరిన అదనపు నీరు బయటకుపోతుంది.

Tags :
|
|

Advertisement