Advertisement

అత్యంత పోషక విలువలు కలిగిన పాలకూర ఉపయోగాలు ..

By: Sankar Wed, 08 July 2020 09:22 AM

అత్యంత పోషక విలువలు కలిగిన పాలకూర ఉపయోగాలు ..



ఆకుకూరలు ఆరోగ్యానికి చాల మంచివి ..అందులోనూ పాలకూరలో అనేక పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి .అయితే పాలకూరలో నీరు శాతం ఎక్కువగా ఉంది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ..ఇప్పుడు పాలకూర తినడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ..

బరువు తగ్గాలి అనుకునే వారికీ పాలకూర సరైనది. మెదడు చురుగ్గా అయ్యేలా చేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. కాన్సర్‌తో పోరాడుతుంది.

టైప్ 2 డయాబెటిస్ తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను సరిచేస్తుంది, నిద్రలేమిని పోగొడుతుంది, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకల్ని బలంగా చేస్తుంది. ప్రెగ్నెన్సీ మహిళలకు పాలకూర చాలా మంచిది.

పాలకూరలోని పొటాషియం... కండరాలను బలపరుస్తుంది. రక్త ప్రసరణను కూడా బాగుచేస్తుంది. ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. పాలకూరలోని విటమిన్ కె జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది.

శరీరంలోని వ్యర్థాలను వెలివేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి పాలకూర మేలు చేస్తుంది. నీరు తక్కువగా తాగేవారికి పాలకూర ప్రయోజనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags :
|
|

Advertisement