Advertisement

  • 'వండర్ ఫ్రూట్' కివి పండ్ల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

'వండర్ ఫ్రూట్' కివి పండ్ల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

By: Sankar Fri, 10 July 2020 12:08 PM

'వండర్ ఫ్రూట్' కివి పండ్ల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..



కివీ పండుకు వండర్ ఫ్రూట్ అని పేరు ఉన్నది . దాదాపు 27 రకాల పండ్లలో లభించే పోషకాలు ఒక్క కివీ పండులో లభిస్తాయట. నారింజ ,బత్తాయి వంటి పండ్ల కన్నా ఇందులో మిటమిన్ సి రెట్టింపు మోతాదులో ఉంటుంది. యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఇందులో కలిగి ఉంది. ఇందులో మిటమిన్ సి తో పాటు మిటమిన్ ఇ,పోటాషియం,పోలిక్ యాసిడ్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషక పదార్ధాలను కలిగి ఉంది. అయితే ఇన్ని పోషకాలు ఉన్న కివి పండ్ల వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూదాం ..

1. నిద్రలేమితో బాధపడుతున్న వారికి దీన్ని మించిన ప్రకృతి ఔషధం మరొకటి లేదు. దీనిలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమిని పోగొడుతుంది. మీరు పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్రపోవడానికి ఇది ఎంతాగనో తోడ్పడుతుంది.

2. రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి బాగా తగ్గిస్తాయి.

3. కివీ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

4. కివీ పండు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. గర్భిణిలు కివీ పండ్లు తింటే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది తోడ్పడుతుంది.

5. రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.



Tags :
|
|
|

Advertisement