Advertisement

  • బ్రౌన్ రైస్ తినడం వలన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి

బ్రౌన్ రైస్ తినడం వలన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి

By: Sankar Fri, 28 Aug 2020 3:56 PM

బ్రౌన్ రైస్ తినడం వలన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి


శరీరానికి కార్బోహైడ్రేట్లు అధికమైతే మేలు కంటే కీడే ఎక్కువ. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు వైట్ రైస్‌కు ప్రత్యమ్నాయ ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా తృణధాన్యాల్లో ముఖ్యమైన బ్రౌన్ రైస్‌ను తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే.. బ్రౌన్ రైస్‌లో బోలడన్ని పోషకాలు ఉన్నాయి..బ్రౌన్ రైసును డైట్‌లో భాగం చేసుకుంటే శరీరానికి లభించే ప్రయోజనాలేమిటో చూసేద్దామా!

1. రౌన్ రైస్‌లోని మెగ్నీషియం, కాల్షియం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

2. ఒక కప్పు బ్రౌన్‌రైస్‌‌లో 21 శాతం మెగ్నీషియం ఉంటుంది.

3. బ్రౌన్ రైస్ వల్ల అధిక బరువు నియంత్రణలో ఉంటుంది.

4. బరువు తగ్గాలనుకునేవారు వైట్‌ రైస్‌కు బదులు బ్రౌన్‌ రైస్ తీసుకుంటే మంచిది.

5. గుండెపోటు, చక్కెర వ్యాధికి కారణమయ్యే మెటబాలిక్ సిండ్రోమ్‌ను బ్రౌన్ రైస్ నియంత్రిస్తుంది.

6. మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలో చక్కెర నియంత్రణకు బ్రౌన్‌ రైస్‌ను వారానికి రెండు లేదా మూడు రోజులు తీసుకున్నా చాలు.

7. ఊపిరిత్తుల వ్యాధి ఉబ్బసాన్ని సైతం బ్రౌన్‌రైస్ నియంత్రిస్తుంది.

8. వారానికి రెండు నుంచి మూడు రోజులు బ్రౌన్‌రైస్ తినేవారిలో ఆస్తమా ముప్పు 50 శాతం తగ్గుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

9. రోజుకు 50 గ్రాముల బ్రౌన్‌రైస్ తీసుకుంటే మధుమేహం (డయాబెటిస్) ముప్పు 16 శాతం తగ్గుతుంది

Tags :
|
|

Advertisement