Advertisement

  • బార్లీ నీళ్లు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బార్లీ నీళ్లు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

By: Sankar Fri, 24 July 2020 07:37 AM

బార్లీ నీళ్లు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు



ఒక గ్లాసుడు బార్లీ వాటర్ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ..ముఖ్యంగా వేసవి కాలంలో బార్లీ నీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయి ..

1. మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్ర నాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి.

2. పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న, వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగాల్సిందే.

3. మధుమేహులకు కూడా బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది.

4. ఇక గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు.

5. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి.

Tags :
|
|

Advertisement