Advertisement

  • Breaking: ఆరోగ్య శాఖామంత్రి కి కరోనా... ఆయన ఆరోగ్యం విషమం...!

Breaking: ఆరోగ్య శాఖామంత్రి కి కరోనా... ఆయన ఆరోగ్యం విషమం...!

By: Anji Thu, 17 Dec 2020 8:51 PM

Breaking: ఆరోగ్య శాఖామంత్రి కి కరోనా... ఆయన ఆరోగ్యం విషమం...!

హర్యానా రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి అనిల్ విజ్ ఆందోళనకరంగా వుంది. ఆయన గత కొన్ని రోజులుగా కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతున్నారు.

గురుగ్రామ్‌లోని మెదంత ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మెదంతలోని ఇంటర్నల్ మెడిసిన్ విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సుశీలా కటారియా మంత్రికి చికిత్స చేస్తున్నారు.

కాగా అనిల్ తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. అయితే ఆసుపత్రి నుండి అధికారిక సమాచారం రావాల్సి వుంది.
కాగా ఆయనకు శనివారం నాడు ప్లాస్మా చికిత్స చేసారు. ఆయనకు కరోనాతో పాటు న్యుమోనియాతో మితమైన COVID-19 కలిగి వున్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

మంత్రి ఆరోగ్య పరిస్థితి అక్కడ మెరుగుపడటం లేదని గుర్తించిన తరువాత పిజిఐఎంఎస్ నుండి గురుగ్రామ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి మార్చాలని అతని కుటుంబం పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన స్వదేశీ కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ మోతాదులను గత నెలలో మంత్రి తీసుకున్నారు.

డిసెంబర్ 5న COVID-19 పాజిటివ్ అని తేలింది. ఐతే ఆయన ఒక్క మోతాదు మాత్రమే తీసుకున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

Tags :

Advertisement