Advertisement

హార్దిక్ పాండ్య గొప్ప మనసు...

By: chandrasekar Wed, 09 Dec 2020 3:20 PM

హార్దిక్  పాండ్య గొప్ప మనసు...


హార్దిక్ పాండ్య తనకు దక్కిన పురస్కారాన్ని సహచర ఆటగాడు నటరాజన్ కు అందించాడు. ఈ అవార్డు దక్కాల్సింది తనకు కాదని అది చేరాల్సిన చోటకు చేర్చాడు. హర్థిక్ పాండ్యా చేసిన పనికి తోటి క్రీడాకారుడిపై అతడు చూపిన క్రీడా స్ఫూర్తికి క్రీడాభిమానులే కాదు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. హర్థిక్ ది గొప్ప మనసు అని అభినందనలు అంటున్నారు. యువ క్రికెటర్ ను ప్రోత్సహిస్తున్న పాండ్యాను చూసి అభిమానులు త్యాగమూర్తివ౦టూ కీర్తిస్తున్నారు. ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ లాస్ట్ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. అయినా 2-1 తో సిరీస్ గెలుచుకుంది. వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన దానికి బదులు తీర్చుకుంది. మూడో టీ 20 మ్యాచ్ ముగిసి అవార్డుల ఫంక్షన్ కూడా అయిపోయింది. టీ 20 సిరీస్ లో బ్యాటింగ్ లో అద్భుత ప్రతిభ చూపడమే కాకుండా రెండో టీ 20 లో భారత్ ను విజయ తీరాలకు చేర్చినందుకు గానూ హార్థిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా దక్కింది. కానీ అతడు దానిని తన సహచర ఆటగాడు నటరాజన్ కు ఇచ్చేశాడు.

ఇటీవలే భారత క్రికెట్ లో తమిళనాడుకు చెందిన నటరాజన్ అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. ఈ టీ 20 సిరీస్ లో భారత విజయానికి అతడు కూడా ముఖ్య కారణం. ఈ లెఫ్టార్మ్ సీమర్ తన అద్భుత బౌలింగ్ తో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు. వాళ్లు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు సాధించింది కూడా నటరాజనే. రెండో వన్డే లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా పాండ్యా ఈ అవార్డుకు నటరాజనే అర్హుడని బహిరంగంగా ప్రకటించాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్ వల్లే భారత్ నెగ్గిందని నటరాజన్ పై ప్రశంసలు కురిపించాడు. తాజాగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను తనకు వచ్చినా దానిని కూడా నటరాజన్ కే అందజేయడం గమనార్హం. పాండ్యా చేసిన పని క్రీడాభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆకర్షితులయ్యారు. నెటిజన్లు పాండ్యాకు ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత పాండ్యా స్పందిస్తూ తన కుటుంబాన్ని మిస్ అవుతున్నానని అన్నాడు. తన బిడ్డను ఎంతగానో మిస్ అవుతున్నానని చెప్పాడు.

Tags :
|
|
|

Advertisement