మమతా బెనర్జీని హెచ్చరించిన గవర్నర్...
By: chandrasekar Fri, 11 Dec 2020 11:58 PM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు
జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి నేపథ్యంలో బెంగల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర
గవర్నర్ జగ్దీప్ ధనకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా అగ్నితో ఆటలాడకూడదని
ఘాటు కామెంట్స్ చేశారు.
మమత చేసిన కామెంట్లకు ఆమె
మన్నింపు అడగాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా
మిగిలిపోతాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి
ఎలా ఇలాగ మాట్లాడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభధ్రతలు పూర్తిగా
దెబ్బతిన్నాయని.. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని వెల్లడించారు ధనకర్.
చట్టాన్ని ఉల్లంఘించే వారికి బెంగాల్ పోలీసులు, యంత్రాంగం రక్షణ
కల్పిస్తున్నాయని ఆరోపించారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి విషయంపై స్పందించిన మమతా
బీజేపీ ర్యాలీల్లో కార్యకర్తలు లేరని, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నడ్డా కాన్వాయ్‌పై
దాడి చేయించారని ఆరోపించారు మమత.