Breaking: అమెరికా అద్యక్షుడు జో బైడెన్ సలహాదారుడు కి కరోనా పాజిటివ్...!
By: Anji Fri, 18 Dec 2020 3:27 PM
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ దగ్గరి సలహాదారుల్లో ఒకరైన కెడ్రిక్ రిచ్మండ్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని బైడెన్ అనుచరులు ధ్రువీకరించారు.
అధ్యక్ష ఎన్నికల నాటి నుంచి బైడెన్ ఎక్కువగా డెలావర్‌లోని తన ఇంటికే పరిమితమయ్యారు. ప్రచార కార్యక్రమం ఉండటం వల్లే ఆయన బయటకు వెళ్లారు.
జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో రిచ్మండ్ కీలక పాత్ర పోషించారు. నల్లజాతి ప్రజల ఓట్లను సంపాదించేందుకు కృషి చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో రిచ్మండ్ కాంగ్రెస్ మొదటిసారిగా గెలుపొందారు. అప్పటి నుంచే బైడెన్‌తో ఈయనకు అనుబంధం ఏర్పడింది.
Tags :
biden |
corona |