Advertisement

  • IND Vs AUS 2020: టెస్టు సిరీస్‌ లొ కరోనా కలకలం... ఇక ఇంటికి వెళ్లాల్సిందే...!

IND Vs AUS 2020: టెస్టు సిరీస్‌ లొ కరోనా కలకలం... ఇక ఇంటికి వెళ్లాల్సిందే...!

By: Anji Fri, 18 Dec 2020 3:52 PM

IND vs AUS 2020: టెస్టు సిరీస్‌ లొ కరోనా కలకలం... ఇక ఇంటికి వెళ్లాల్సిందే...!

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌పై కరోనా ప్రభావం పడింది. సిడ్నీలో క్రమంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సిరీస్‌కి కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీ క్రికెటర్లలో కొంత మందిని ఇంటికి పంపించేశారు.

ఇందులో ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌ లీ కూడా ఉండగా.. సిరీస్‌ని ప్రసారం చేస్తున్న ఫాక్స్ స్పోర్ట్స్, ఛానెల్ 7 కూడా తమ స్టాఫ్‌లో కొంత మందిని ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది.

దాంతో.. సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జనవరి 7 నుంచి 11 వరకూ జరగాల్సిన మూడో టెస్టుపై సందేహాలు నెలకొన్నాయి.

ఆస్ట్రేలియా గడ్డపై ఈ సిరీస్ బయో- సెక్యూర్ వాతావరణంలో జరుగుతుండగా.. రెండు జట్ల క్రికెటర్లతో పాటు కోచ్‌లు, సహాయ సిబ్బంది క్వారంటైన్‌లో ఉండి కరోనా వైరస్ పరీక్షల అనంతరం ఈ బబుల్‌లోకి వచ్చారు.

కానీ.. మ్యాచ్ కామెంటేటర్లు, ఛానల్ స్టాఫ్ ఈ బబుల్‌లో లేరు. దాంతో.. మ్యాచ్‌ గ్యాప్‌లో వారు ఇంటికి వెళ్లి మళ్లీ విధులకి వస్తున్నారు. ఈ క్రమంలో బ్రెట్ లీ కూడా ఇటీవల సిడ్నీ నుంచి రాగా.. ఛానల్ స్టాఫ్ కూడా అలానే వచ్చారు.

దాంతో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కామెంటేటర్‌గా ఉన్న బ్రెట్‌ లీని క్వారంటైన్‌లో ఉండి.. విధులకి హాజరయ్యే వెసులబాటుని కల్పించారు.

కానీ.. త్వరలోనే క్రిస్మస్ రాబోతుండటంతో.. ఫ్యామిలీతో సమయం గడపాలని కాంక్షించిన బ్రెట్ లీ తాను సిరీస్‌లో కామెంటేటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

సిడ్నీలో కరోనా పాజిటివ్ కేసులు గత కొద్దిరోజుల నుంచి గణనీయంగా పెరుగుతుండటంతో.. సిడ్నీ సరిహద్దులు మూసివేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.

Tags :

Advertisement