Advertisement

కొత్తిమీర‌తో ప్ర‌యోజ‌నాలు

By: chandrasekar Thu, 18 June 2020 2:19 PM

కొత్తిమీర‌తో ప్ర‌యోజ‌నాలు


కొత్తిమీర చాలా క‌ర్రీస్‌లో వాడుతుంటారు. కొత్తిమీర‌ ధ‌నియాల‌ నుంచే వ‌స్తుంది. సువాసన కలిగి ఉండే కొత్తిమీరను కూరలలో ఎందుకు వాడతారు, వాటి ప్రయోజనాలేంటో ఇప్పటి జెనరేషన్‌కి అంతగా తెలియదు. ఇది కేవ‌లం గార్నిష్ కోసం ఉప‌యోగిస్తారు అనుకుంటారు.

* ఇది గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. రోజూ కొత్తిమీర తినడం వల్ల అధిక రక్తపోటు, చెడు కొవ్వును తగ్గించి గుండె పనితీరు మెరుగు పరుగుస్తుంది.

* ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కొత్తిమీర కాపాడుతుంది. కొత్తిమీర తరచుగా తింటే బ్యాక్టీరియా వ‌ల్ల క‌లిగే ఇన్‌ఫెక్షన్‌ సమస్య మటుమాయం.

* చర్మ సంరక్షణలోనూ కొత్తిమీర కీలకపాత్ర పోషిస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగేవారి శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.

benefits,coriander,juice,health,heart ,కొత్తిమీర‌తో, ప్ర‌యోజ‌నాలు, ఎక్కువగా, తిరిగేవారి, శరీరాన్ని


* కొత్తిమీరలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడుపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. త్వరగా ఒత్తిడి, ఆందోళన చెందడాన్ని అదుపుచేస్తుంది.

* రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, బ్రెస్ట్ (ఛాతీ) భాగాలలో క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా నియంత్రిస్తుంది. కొత్తిమీర కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.

* కొత్తిమీర తిన‌డం వ‌ల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ధనియాల నుంచి తీసే నూనె జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. తరచుగా అసహనానికి గురయ్యేవారి సమస్యకు కొత్తమీర చెక్ పెడుతుంది.

* కొత్తిమీర‌ రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం, కీమోథెరపి వల్ల కలిగే నష్టాలను తగ్గిస్తుంది. రక్తనాళాలలో ఆటంకాలను తొలగించి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.

* చాలా రకాల వంటలలో కొత్తిమీరను వాడుతారు. దీనివల్ల కూరలు రుచితోపాటు, సువాసనను వెదజల్లుతాయి. వంటలకు కొత్తిమీర కొత్తదనాన్నిస్తుంది.

Tags :
|
|

Advertisement