Advertisement

అద్బుతమనిపించే యాలకుల ఆరోగ్య ప్రయోజనాలు

By: Sankar Sun, 06 Sept 2020 06:37 AM

అద్బుతమనిపించే యాలకుల ఆరోగ్య ప్రయోజనాలు


యాలకులు అంటేనే వాటి రుచి, సువాసన మనకు గుర్తొకొచ్చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో వీటికి మించినవి లేవు. నోటి దుర్వాసనను తగ్గించడంలోనూ ఇవి బెస్ట్. మన ఇంట్లో వంటే పలు రకాల్లో స్వీట్లలో వీటిని ఉపయోగిస్తుంటాం. అన్ని వంటకాలకు ఇవి మంచి సువాసనను, రుచిని అందిస్తాయి. వీటిలో చాలా ఆరోగ్య రహస్యాలున్నాయి..

1. మనం తిన్న ఆహారాన్ని వెంటనే జీర్ణం చేసే గుణాలు యాలకుల్లో ఉంటాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను ఎదుర్కొనే లక్షణాలు యాలకుల్లో ఉంటాయి. జీవక్రియను వేగవంతం చేయగల సామర్థ్యం యాలకులకు ఎక్కువగా ఉంటుంది.

2. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే యాలకుల్లో కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి. యాలకుల్లో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధికరక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

3. మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం కలిగించేందుకు యాలకులు ఎంతోగానూ ఉపయోగపడుతాయి. ఆ సమయంలో వీటిని తింటే మీరు వెంటనే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. యాలకులు డిప్రెషన్ విషయంలో తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది.

4. ఆస్తమాను కాస్త అదుపులో ఉంచగలిగే గుణాలు యాలకుల్లో ఉంటాయి. ఆకుపచ్చని యాలకులు గురక తగ్గించేందుకు, దగ్గు నివారణకు, శ్వాస ఆడకపోవడాన్ని తగ్గించేందుకు బాగా పని చేస్తాయి

5. డయాబెటిస్ ను యాలకులు కొంత మేరకు అదుపులో ఉంచగలవు. వీటిలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం రాకుండా అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

6. యాలకుల్లోని రసాయనాలు నోటిలోని బాక్టీరియంపై చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. రోజూ రెండు యాలకులను నోట్లో వేసుకుని నమిలితే మంచి ఫలితం ఉంటుంది. యాలకులను నమిలితే నోటి దుర్వాసన పోయి చిగుళ్ళు, దంతాలను ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లోఇన్ఫెక్షన్స్ రావు.





Tags :
|
|

Advertisement