Advertisement

గుమ్మడిపండు తినడం వలన గంపెడు ప్రయోజనాలు

By: Sankar Tue, 15 Sept 2020 4:25 PM

గుమ్మడిపండు తినడం వలన గంపెడు ప్రయోజనాలు


తియ్య గుమ్మడి ఇది శీతాకాలంలో అధికంగా లభిస్తుంది. దీనిని కాయగానూ, పండుగానూ కూడా పిలుస్తుంటారు. భారతీయ వివాహాలలో దీనికి మంగళప్రదమైన స్థానం ఉంది. మన నిత్య వంటకాలలో దీనిని కూరగా వండుతుంటారు.. పులుసులో ముక్కలుగా ప్రాముఖ్యత సంతరించుకుంది..ఈ తియ్యటి గుమ్మడి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

1. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది. కంటి ఆరోగ్యానికి, చర్మ కాంతికి, గుండె బలానికి దోహదకారి.

2. అధిక బరువుని తగ్గించటానికి ఉపయోగకరం. కాన్సరు వంటి క్లిష్టమైన వ్యాధులను నివారించటానికి, వ్యాధి తీవ్రతను తగ్గించటానికి ఉపకరిస్తుంది.

3.డయాబెటీస్ రాకుండా ఉండేందుకు , వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది .

4.బి.పి.ని నియంత్రిస్తుంది ,

5. పీచు పదార్ధము ఎక్కువగా ఉన్నందున కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది ,

6. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంభంద వ్యాదులు తగ్గుతాయి

7. గుమ్మడి విత్తనాలు తినడం వలన మలబద్ధకం నివారణ ఆవుతుంది

8.. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

Tags :
|
|

Advertisement