Advertisement

  • సీతాఫలంలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

సీతాఫలంలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

By: Sankar Wed, 02 Sept 2020 4:28 PM

సీతాఫలంలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు


సీతాఫలం అత్యంత రుచికరంగా ఉండే ఫలాల్లో ఇది ఒకటి..కాకపోతే ఇది అన్ని సీజన్లలో దొరకదు..ఎక్కువ వర్షాకాలంలో లభ్యమవుతుంది..సీజనల్ ప్రాబ్లమ్స్ తగ్గించడమే కాకుండా సితాఫలంలో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో, ఈ కాలంలో ఈ పండు ని ఎందుకు రెగ్యులర్ గా తీసుకోవాలో తెలుసుకోండి.

1. సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది. సమతులాహారానికి ఉదాహరణగా ఈ పండుని చెబుతారు. ఇందులో కాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివన్నీ సరైన క్వాంటిటీలో ఉంటాయి.

2. సీతాఫలంలో ఉండే ఫైబర్, మినరల్స్ వల్ల ఈ పండు అరుగుదలకి తోడ్పడుతుంది. బౌల్ మూమెంట్‌కి సహకరిస్తుంది. తద్వారా, గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు దూరమౌతాయి. అంతే, కాకుండా డయేరియా లాంటి ప్రాబ్లంస్ కి కూడా ఈ పండు చెక్ పెడుతుంది..

3. సీతాఫలంలో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ విటమిస్న్ వయసు మీద పడకుండా చేస్తాయి. ఈ పండులో ఉండే యాంటీ-ఏజీయింగ్ ప్రాపర్టీస్ వలన స్కిన్ మంచి గ్లో తో ఉంటుంది. ఈ పండు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి సెల్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

4. చాలా రకాల పండ్ల లాగానే సీతా ఫలం లో కూడా శరీరాన్ని చల్లబరిచే గుణాలున్నాయి. ఇండియా లాంటి ట్రాపికల్ కంట్రీలో వానలు పడుతున్నా కూడా వేడి తగ్గదు. ఈ పండు బాడీ యోక్క నాచురల్ టెంపరేచర్ ని మెయింటెయిన్ చేస్తుంది. ఎక్కువ ఉన్న వేడిని బైటికి పంపేస్తుంది.

5. ఎవరైతే బరువు పెరగాలనుకుంటారో, అటువంటి వారు సీతాఫలం జ్యూస్ లో తేనె మరియు పాలు మిక్స్ చేసి రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇది క్యాలరీలను పెంచుతుంది.

6. గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధకత పెరగడానికి సహాయపడుతుంది. మరో ముఖ్యమైన ప్రయోజనం గర్భస్రావాన్ని నివారిస్తుంది.

7. సీతాఫలంలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల బ్రోంకైల్ ఇన్ప్లమేషన్ తగ్గించి ఆస్త్మాటిక్స్ అటాక్ ను తగ్గిస్తుంది.


Tags :
|

Advertisement