Advertisement

  • బీట్ రూట్ తింటే ఆరోగ్యానికి రూట్ క్లియర్ చేసుకున్నట్లే

బీట్ రూట్ తింటే ఆరోగ్యానికి రూట్ క్లియర్ చేసుకున్నట్లే

By: Sankar Sun, 11 Oct 2020 5:55 PM

బీట్ రూట్ తింటే ఆరోగ్యానికి రూట్ క్లియర్ చేసుకున్నట్లే


పండ్లలో యాపిల్ ఎంత పవర్ ఫుల్‌గా పనిచేస్తుందో. కూరగాయల్లో బీట్‌రూట్ అంత కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజూ బీట్‌రూట్ తింటే.. అనారోగ్యాన్ని బీట్ చేస్తారు. బరువు తగ్గాలన్నా, రక్తహీనత, గుండె సమస్యలను దూరం చేయాలన్నా.. బీట్‌రూట్ తప్పకుండా తినాల్సిందే. భూమిలో పండే బీట్‌రూట్ ఎన్నో రకాల పోషకాలను సంగ్రహిస్తుంది. మరి, పోషకాలు సమృద్ధిగా ఉండే బీట్ రూట్‌ను నిత్యం తీసుకుంటే శరీరానికి లభించే ప్రయోజనాలు ఏమిటో చూసేద్దామా!

1. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిదని సూచిస్తున్నారు.

2. అలాగే బీట్‌రూట్ వల్ల బద్దకం కూడా దరిచేరదట. ఎనర్జీ డ్రింక్‌లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకొనే బదులు.. బీట్ రూట్ జ్యూస్ తాగి ఎక్కువ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని సొంతం చేసుకోండని సూచిస్తున్నారు. బీట్‌రూట్ అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు దోహదం చేస్తుందట.

3. రక్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే గుండె పనితీరు కూడా బాగుంటుంది. ఈ విషయంలో బీట్‌రూట్ మించినది మరేదీ లేదు. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు.

4. బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే హైబీపీ తదితర సమస్యలు దూరమవుతాయి. ఎముకల్ని దృఢంగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్‌కు ఉంది. గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. చ‌ర్మాన్ని కాంతివంతం చేయ‌డానికి బీట్‌రూట్ స‌హాయ‌ప‌డుతుంది

5. మైనర్ తలసేమియా, రక్తహీనత బాధపడేవారికి ఐరన్ ఎంతో ముఖ్యం. రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య ఉండదు. బీట్‌రూట్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి కూడా పెరుగుతుంది.

6. కాలేయం శుభ్రం కావడానికి కూడా బీట్ రూట్ ఎంతో ఉపయోగపడుతుంది.

7. చర్మ సంబంధిత వ్యాధులు కూడా దరిచేరకుండా కాపాడుతుంది.

8. పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. బీట్‌రూట్ జ్యూస్ వల్ల మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది.

Tags :
|

Advertisement