Advertisement

వాములో ఉన్న వైద్య గుణాలు తెలుసా !

By: Sankar Wed, 09 Sept 2020 8:30 PM

వాములో ఉన్న వైద్య గుణాలు తెలుసా !


వాము, దీన్ని మనం ఓమ అని కూడా పిలుస్తాం. దీన్ని రోజూ వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇది కఫాన్ని హరిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే..

1. వాము జీర్ణశక్తిని పెంచుతుంది.తిన్న ఆహారం జీర్ణం కానపుడు వేడినీటిలో వాము వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

2. దీంతో తయారుచేసిన కషాయం తాగితే జ్వరం తగ్గిపోతుంది.

3. ఇవి వికారాన్ని తగ్గిస్తుంది. వాంతులు తగ్గడానికి ఉపకరిస్తుంది.

4. చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు లాంటి సమస్యలుంటే వాముని వేయించి కాస్త నలిపి వాసన చూపించడం వల్లమంచి ఫలితం ఉంటుంది.

5.ప్రతిరోజూ అరటీస్పూన్‌ వాము తినడం వల్ల హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

6. వాములో ఉండే పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌ గుండెజబ్బులు రాకుండా నివారిస్తాయి.

7. ఇందులో విటమిన్‌ ఏ తోపాటు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సీ కూడా ఉంటుంది

Tags :
|
|
|

Advertisement