Advertisement

  • తాజా కరోనా బులెటిన్: తెలంగాణలో మళ్లీ భయపెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు...!

తాజా కరోనా బులెటిన్: తెలంగాణలో మళ్లీ భయపెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు...!

By: Anji Sat, 19 Dec 2020 12:10 PM

తాజా కరోనా బులెటిన్: తెలంగాణలో మళ్లీ భయపెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు...!

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వెయ్యిలోపే కరోనా కేసులు నమోదు అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే..గడిచిన 24 గంటల్లో మొన్నటి తో పోలిస్తే కాస్త పెరిగాయి.

తాజా కరోనా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 627 పాజిటివ్ కేసులు నమోదు కాగా..వైరస్ కారణంగా నలుగురు మృతిచెందారు.

అలాగే 721 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,80,822 కు పెరగగా.. ఇప్పటి వరకు 1,489 మంది కరోనాతో మృతిచెందారు.

ఇక, కరోనా మరణాలు దేశంలో 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయిన.. రికవరీ రేటు దేశంలో 96.99 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 95.5 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,942 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 4,814 హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

Tags :

Advertisement