Advertisement

  • ఇది మీకు తెలుసా... ఇవీ తింటే ఎముకలు దృఢంగా మారుతాయి...!

ఇది మీకు తెలుసా... ఇవీ తింటే ఎముకలు దృఢంగా మారుతాయి...!

By: Anji Mon, 21 Dec 2020 4:01 PM

ఇది మీకు తెలుసా... ఇవీ తింటే ఎముకలు దృఢంగా మారుతాయి...!

శరీరానికి శక్తి ఇచ్చే ఎన్నో అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి. వాటిలో శనగలు ఒకటి. శనగలను కొంత మంది ఉడికించుకొని తింటారు. మరి కొంతమంది వేయించుకుని తినటానికి ఇష్టపడతారు.

ప్రతి రోజు ఒక కప్పు శనగలను తింటే శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తి అందుతాయి. అసలు శనగలను తినటం వలన మన శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. శనగల్లో మాంసంలో ఉండే ప్రోటీన్స్ ఉంటాయి.

అందువల్ల నాన్‌వెజ్ తిన‌లేని వారికి శ‌న‌గ‌లు ఒక వ‌ర‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ప్రతి రోజు ఒక కప్పు ఉడికించిన శనగలను తింటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి. శనగలను తరచుగా తింటూ ఉండే రక్తంలో ఎర్ర రక్తకణాలు పెరిగి రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.


శనగల్లో పీచు పదార్ధం సమృద్ధిగా ఉండుట వలన చెడు కొలస్ట్రాల్ ని తొలగించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. శనగల్లో పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉండుట వలన హైబీపీని కంట్రోల్ చేస్తాయి.

శ‌న‌గ‌ల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ వంటి ఉప‌యోగ‌క‌ర‌మైన పోష‌కాలు సమృద్ధిగా ఉండుట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. దాంతో నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. పాల‌లో ఉండే కాల్షియంకు దాదాపు స‌మానమైన కాల్షియం శ‌న‌గ‌ల్లో ల‌భిస్తుంది.

దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముక‌లకు పుష్టి క‌లుగుతుంది. శనగలను తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి తొందరగా వేయదు. అందువల్ల బరువు తగ్గాలని అనుకొనే వారికీ శనగలు మంచివని చెప్పవచ్చు.

Tags :

Advertisement