ఆధునికతతో సోయగాలు చిందిస్తున్న సంప్రదాయం
By: chandrasekar Mon, 13 July 2020 2:26 PM
నెట్ బ్లౌజ్‌మీద వర్క్
పట్టు, కాటన్
ఇలా ఏ ఫ్యాబ్రిక్ అయినా మ్యాచింగ్ బ్లౌజులు రావడం పరిపాటి. కానీ, ఇప్పుడు
నెట్ బ్లౌజుల ట్రెండ్ నడుస్తున్నది. ఎలాంటి చీరల మీదయినా అవి ఇట్టే
అమరిపోతున్నాయి. మొత్తం నెట్ బ్లౌజ్‌మీద వర్క్ చేయించి మగువలు మురిసిపోతున్నారు.
పట్టుచీరల మీదా నెట్ స్లీవ్స్ అదిరిపోయే లుక్‌ని తెచ్చి పెడుతున్నాయి. ప్లెయిన్
చీరలమీదకి వీటిని మరింత ఎక్కువగా కుట్టిస్తున్నారు.
మెహందీ
కోన్‌తో అరచేయి మొత్తం
నింపేసి తర్వాత వేళ్లకు ఎలాంటి డిజైన్లు పెట్టాలా అని ఆలోచించే వాళ్లున్నారు.
వారికోసమే నయా డిజైన్లు వచ్చాయి. లేస్ వర్క్, చుక్కలతో వచ్చిన డిజైన్లు, ఫింగర్
బ్యాండ్స్. పువ్వులు, నగల డిజైన్లు కూడా చూడముచ్చటగా కనిపిస్తాయి.
ఇవికాకుండా అరబిక్ స్టయిల్, షేడెడ్ స్టయిల్స్ ఉండనే ఉన్నాయి.పెండ్లి కూతుళ్లకు
ప్రత్యేక డిజైన్‌లు ఉండటం ఇక్కడ విశేషం.
పడతీ మెచ్చేది అందెలనే
"అందెలు" వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి స్త్రీ
కి నచ్చుతుంది. స్త్రీలే కాదు, పురుషులు
కూడా ఈ అందెల రవళిని వినడానికి ఇష్టపడతారు. పుట్టిన పాపాయికి, నవ
వధువుకు బహుమతిగా గజ్జెలను ఇవ్వడం ఆనవాయితీ. భారతీయ సంప్రదాయంలోని ట్రెడిషనల్
డిజైన్లు కాకుండా ముత్యాలు, రత్నాలతోనూ గజ్జెలు అందుబాటులోకి వస్తున్నాయి. వెండి, బంగారం, వన్‌గ్రామ్
గోల్డ్‌లోనూ కనువిందు చేస్తున్నాయి. తమ ఇష్ట్టానికి తగ్గట్టుగా గజ్జెలు ఉండేలా
డిజైన్ చేయించుకుంటున్నారు
కొత్త టెక్నాలజీని కలిపి
నగలు
ఇప్పటివరకు ఆ చెట్లూ
చేమలకు పరిమితమైన ఆదివాసుల ఫ్యాషన్, నయా ప్రపంచంలోకి వచ్చింది. పెద్దపెద్ద డిజైన్లకు
కొత్త టెక్నాలజీని కలిపి నగలను తయారుచేస్తున్నారు ఫ్యాషనిస్టులు. వీటికి కలర్‌ఫుల్‌గా
దారాలను జోడించి, జామెట్రిక్ డిజైన్లతో ఎక్కువగా వెండితో నగలను
రూపొందిస్తున్నారు. దేవుడి బొమ్మలు, ఇతర డిజైన్లతో మగువల మనసులను దోచేస్తున్నాయి. కేవలం
చీరల మీదే కాదు, పంజాబీ డ్రెస్‌లు, స్కర్ట్‌ల మీద కూడా నగలు ధరిస్తున్నారు.