అమ్మాయిలు ఇష్టపడే గోరింటాకు
By: chandrasekar Wed, 24 June 2020 6:23 PM
గోరింటాకు ఇష్టపడని
అమ్మాయిలు ఎవరు వుండరు మరియు ఇది అమ్మాయిలకు చాలా మంచి నేస్తం. కొంతమంది
పదిరోజులకోసారైనా చేతులకు పెట్టుకోనిదే ఉండలేరు. చేతిని అందంగా పండించే గోరింట
వల్ల ఆరోగ్యానికి, అందానికి కూడా అనేక లాభాలున్నాయి. గోరు పుచ్చిపోవడం, ఏదైనా
దెబ్బతాకి ఇన్ఫెక్షన్ సోకడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు గోరింటాకు ముద్దని గోరుకు
తరుచూ పెట్టుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
కొందరికి అరికాళ్లు
మండుతూ ఉంటాయి. అప్పుడు కూడా గోరింట పేస్టును రాయాలి. మంట తగ్గి కాస్త ఉపశమనం
లభిస్తుంది. మహిళలు ఎంతో ఇష్టపడే గోరింటాకులో ఎన్నో ఔషధగుణాలున్నాయని ఆరోగ్య
నిపుణులు అంటున్నారు. ఏదైనా పండగ వచ్చేస్తే చేతినిండా గోరింటాకు పెట్టుకునే
మహిళలకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవని వారు చెబుతున్నారు. గోరింటాకు క్రిములను
నాశనం చేస్తుంది. కంటికి కనిపించని సూక్ష్మ క్రిములను గోరింటాకు నశింపజేస్తుంది.
గోరింటాకును నెలకొక్కసారి చేతికి పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆషాడ మాసం రాగానే కొత్తగా పెళ్లైన వాళ్లంతా పుట్టింటికి వెళ్లిపోతారు. పుట్టినింట
దొరికే గోరిటాకుతో చేతికి, కాళ్లకి పెట్టుకొని మురిసిపోతుంటారు. అసలు ఆషాడం
రాగానే ఎప్పుడూ పెట్టుకోని వాళ్లు కూడా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు. పెట్టుకోకపోతే
అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా? అన్న సందేహాలకు ఇప్పుడు చెక్ పెట్టేసేయండి.
ఆషాడం మాసం మొదటి నుంచే
వర్షాలు స్టార్ట్ అవుతాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. దీనివల్ల
సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. వాతావరణం చల్లబడుతుంది
కానీ శరీరంలో వేడి మాత్రం అలానే ఉంటుంది. దీనివల్ల సమస్యలు వచ్చే ప్రమాదం
ఉంది. భారతీయులు పాటించే ప్రతి ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు దాగుంటాయి.
* గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఎక్కువగా
ఉంటుంది.
* ఇది రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా
జరిగేలా చేస్తుంది.
* ఆడవాళ్లు ఎక్కువగా డిటర్జంట్స్, సర్ఫులను
వాడుతుంటారు. ఇవి వారి గోళ్లలో నీరు ఎక్కువగా చేరి అనారోగ్యానికి గురి
చేస్తుంది.
* తలకు గోరింటాకు రసాన్ని మర్థనా చేస్తే వెంట్రుకలు
బాగా పెరుగుతాయి. తలలో చుండ్రు ఉన్నప్పుడు గోరింటాకు రసం వ్రాస్తుంటే చుండ్రు
పోతుంది. చిన్న వయస్సులో తల వెంట్రుకలు తెల్లబడితే రకరకాల హెయిర్ డైలు రాయాల్సిన పనిలేదు. ఈ
రోజుల్లో అయితే హెయిర్ డైలు ఉన్నాయి కానీ ఈ పూర్వం సౌందర్య సాధనాలలో గోరింటాకు
ముఖ్యంగా ఉపయోగించేవారు.
* దీనికి చెక్ పెట్టేందుకు గోరింటాకు పెట్టుకోమని
పెద్దలు చెబుతుంటారు.
గోరింటాకు ఎర్రగా పండితే
మంచి మొగుడు వస్తారని అంటుంటారు. అలా ఎర్రగా పండాలంటే కొన్ని పాటిస్తే సరిపోతుంది.
గోరింటాకు రుబ్బేటప్పుడు కొంచెం మజ్జిగ, వక్క, నిమ్మరసం వంటి పదార్థాలు వేస్తే గోరింటాకు ఎర్రగా
పండుతుంది. ఇంకో విషయం గోరింటాకు పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయి
రాలిపోయేంత వరకు చేయి కడుగకూడదు. అంతసేపు ఉండాలంటే కష్టం అని చాలామంది
రాత్రులు పెట్టుకొని పడుకుంటారు. గోరింటాకు శుభ్రం చేసుకున్న తర్వాత చేతులకు
కొబ్బరి నూనె రాసుకోవాలి. అప్పుడే గోరింటాకు మంచి కలర్‌లోకి వస్తుంది.
సిటీల్లో ఉండేవాళ్లకు గోరింటాకు దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు మార్కెట్‌లో
దొరికే మెహందీ కొనుక్కొని పెట్టుకోవచ్చు. దీంతో మంచి మంచి డిజైన్లు కూడా వేసుకోవచ్చు.
అయితే మెహందీ కొనేటప్పుడు జాగ్రత్త వహించి మంచిది కొనుక్కోవాలి. నాసిరకంవి
కొంటే నిజంగానే అనారోగ్యానికి గురవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు.