Advertisement

డెనిమ్‌ డ్రెస్సింగ్‌లో కొత్త పోకడలు

By: chandrasekar Mon, 06 July 2020 6:08 PM

డెనిమ్‌ డ్రెస్సింగ్‌లో కొత్త పోకడలు


జీన్స్‌.. ఈ శతాబ్ధంలోనే అత్యంత దీర్ఘకాలం పాటు నిలిచిన డ్రెస్‌ స్టైల్‌ ఏ షర్ట్‌ లేదా టీషర్ట్‌ లేదా కుర్తాతో సహా ఏదివేసుకున్నా మ్యచింగ్‌కిఅనువుగా మారిపోవడందీని స్పెషాలిటీ. దీనికి ప్రధాన కారణం కాలంతో పాటుమార్పుచేర్పులకూ అవకాశం ఉండటమే. ఎప్పటికప్పుడు టెక్నిక్స్‌ ఉపయోగించి ట్రెండీస్టైల్స్‌గా మార్చుకోగలగడమే. జీన్స్‌ ఒకటే స్టైల్స్‌ ఎన్నో అంటున్న యువత పాత కొత్త తేడా తెలియనివ్వని డెనిమ్‌. కొద్ది రోజులు వాడాక, కొత్త దనం కోల్పోయిన జీన్స్‌ని ఇంట్లో ఉన్న ట్వీజర్స్, శాండ్‌పేపర్, సిజర్స్, చీజ్‌లను ఉపయోగించి మరింత ట్రెండీగా, స్టైలిష్‌గా మార్చుకోవచ్చు. దేనిని ఉపయోగించి ఏంమార్పు చేర్పులు చేసుకోవచ్చు. అంటే ట్వీజర్స్‌ డెనీమ్‌ జీన్స్‌ని మోకాళ్ల వరకు సమానంగా కట్‌ చేసి, ఆ అంచులలో ట్వీజర్‌ సహయంతో నీలి దారాలను మాత్రమే తొలగించి, తెలుపు దారాలను అలాగే వదిలేయాలి. ప్యాంట్‌ని 2, 3 సార్లు వాష్‌ చేశాక ఆ అంచులకు సహజమైన ఫేడ్‌ లుక్‌ వస్తుంది. శాండ్‌పేపర్‌‡ మార్కెట్‌లో లభించే సాధారణ శాండ్‌పేపర్‌తో జీన్స్‌పైన సున్నితంగా పైపొర తొలిగేంత వరకు రుద్దాలి. క్షణాల్లో పాత జీన్స్‌కి కొత్త వాన్‌ లుక్‌ వస్తుంది.

సిజర్స్‌ కత్తెరతో జీన్స్‌ అంచులను కట్‌ చేసి తరువాత వాటిని వాష్‌ చేస్తూ వదులుగా విడదీయాలి. తద్వారా లేటెస్ట్‌ స్టైల్‌ని యాడ్‌ చేసినట్టవుతుంది. ఛీజ్‌ గ్రేటర్‌– పొట్టుతీయడానికి వంటింట్లో వాడే ఛీజ్‌ గ్రేటర్‌తో జీన్స్‌పైన అక్కడక్కడా ముక్కలుగా కట్‌ చేయాలి. అనంతరం చీజ్‌ గ్రేటర్‌తో సున్నితమైన అంచులు వచ్చేంత వరకు రుద్దాలి. ఇది ఆకర్షణీయంగా ఉండి పార్టీ వేర్‌కి పనికొస్తుంది.

జీన్స్‌ దుస్తుల మన్నికను పెంచుకోవడానికి ప్యాచ్‌వర్క్‌ మంచి టెక్నిక్‌. తొందరగా చిరిగిపోయేందుకు అవకాశం ఉన్న మోకాలు, ప్యాకెట్స్‌ వద్ద స్టైలీష్‌గా కత్తిరించిన పలు రకాల జీన్స్‌ ముక్కలను జత చేయడమే. ఇందులో ముందుగానే ప్యాంట్‌ని ఆ ప్రాంతాల్లో మార్క్‌ చేసుకుని కట్‌చేసి, లోపలి నుంచి ఈ ముక్కలను అదే రంగు దారంతో రన్నింగ్‌ స్ట్రిచ్‌ చేయాలి. దాని అంచులను రబ్‌ చేసి వదిలిస్తే మంచి లుక్‌తో పాటు ఫంకీ స్టైల్‌ వస్తుంది. ప్రస్తుతం ఇది ట్రావెలర్‌ ట్రెండ్‌. లేడీస్‌ జిన్స్‌కి మాత్రం బోహో–చిక్‌ జత చేస్తే ఆ డెనీమ్‌కి సరికొత్త లుక్‌ వస్తుంది.

new trends,denim,dressing,fashion,borders ,డెనిమ్‌, డ్రెస్సింగ్‌లో, కొత్త, పోకడలు, సరికొత్త


ఇంట్లో ఉండే సూదీ దారంతో మనకున్న జీన్స్‌ని మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఆకర్షణీయంగా ఉండే రంగు దారంతో రన్నింగ్‌ స్ట్రిచ్‌ లేదా చైన్‌ స్ట్రిచ్‌తో ఎంబ్రాయిడింగ్‌ చేసి ట్రెండీగా మార్చుకోవచ్చు. ఇందులోనే లావుగా ఉన్న దారంతో ప్యాకెట్స్‌ వద్ద, అంచుల్లో, సైడ్‌ లైనింగ్‌ వద్ద ఫాక్స్‌–సాడ్డల్‌ స్ట్రిచ్‌తో మరింత అందంగా మార్చుకోవచ్చు.

మరీ మరీ స్వేచ్ఛా పిపాసులు, ఫార్ములాకి కట్టుబడని వారు అయితే.. జీన్స్‌ను రెండు హుక్స్‌కు తగిలించి గోడకు వేలాడదీసి.. రంగులద్దుకున్న జీన్స్‌ మొత్తం రంగుల చుక్కలు పడేలా బ్రష్‌లతో చల్లాలి.

జీన్స్‌కి మరింత రఫ్‌ లుక్‌ కావాలనుకుంటే టోన్‌ జీన్స్‌కి బ్యాడ్జెస్‌ కలపాలి. ఈ బ్యాడ్జెస్‌తో గ్రంజీ మిలిటరీ లుక్, ప్రెప్పీ స్పోర్టీ లుక్‌తో వ్యక్తిగతమైన స్టైల్‌ని రూపొందించుకోవచ్చు.

new trends,denim,dressing,fashion,borders ,డెనిమ్‌, డ్రెస్సింగ్‌లో, కొత్త, పోకడలు, సరికొత్త


ప్రస్తుతం బాగా నడుస్తున్న ట్రెండ్‌ ఇది. జీన్స్‌ వేసుకోవడాన్ని క్రేజీగా ఫీలవుతున్నారు. ఆక్రిలిక్‌ పేయింట్స్‌తో మామూలు జీన్స్‌ని డూడుల్‌ ఆర్ట్‌గా మార్చుకోవచ్చు. సమాంతర ప్రదేశంపైన ప్యాంట్‌ని ఉంచి ముందుగానే విభిన్న స్టైల్స్‌లో డూడుల్స్‌ని మార్క్‌ చేసుకోవాలి. అనంతరం ఆక్రిలిక్‌ పేయింట్స్‌ని వివిధ రకాల బ్రెష్‌లతో ఆ మార్క్స్‌ వద్ద అద్ది డ్రైయర్‌తో ఆరేంత వరకు ఉంచి వేసుకోవడమే.

జీన్స్‌ పైన ఇదొక ఫన్నీ, క్రేజీ స్టైల్‌.. చిన్నప్పుడు అక్షరాలను నేర్చుకునేటప్పుడు స్కూల్‌లో అందరం స్టెన్సిల్‌ పలకని (అక్షరాలు ముద్రించబడిన ఫ్రేమ్‌) వాడే ఉంటాం. ఇక్కడ అదే స్టెన్సిల్‌ పలకని ఉంచి నచ్చిన ప్యాటర్న్‌లో పేయింట్‌ చేసుకొని స్టైలీ లుక్‌ తేవడమే.

ట్విల్‌ టేప్స్, బీడ్స్‌ను మన జీన్స్‌కు జతచేయడం కూడా కొత్త తరహా లుక్‌ అందిస్తుంది. ఇది హై ఫ్యాషన్‌ మేకోవర్‌ అనొచ్చు. జీన్స్‌ స్టిచ్‌ లైనింగ్‌ పైన ట్విల్‌ టేప్‌ని జతచేసి మరింత అందంగా కనిపించేందుకు స్టడ్స్, స్టైల్‌ పిన్స్‌ని అమర్చుకోవచ్చు.

Tags :
|

Advertisement