పాశ్చాత్య దుస్తులకు మ్యాచ్ అయ్యే ఫ్యాషన్ జ్యువెలరీ
By: chandrasekar Sat, 20 June 2020 5:18 PM
ఇప్పటి తరానికి డ్రెస్
లకు తగినట్లు చాలా రకాల ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. స్మర్ట్, క్రాప్‌టాప్స్, ఫ్రాక్స్, లాంగ్‌గౌన్స్
ఇలాంటి పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు అలాంటి ఫ్యాషన్ జ్యువెలరీ ధరస్తేనే
బాగుంటుంది. సంప్రదాయ ఆభరణాలు అస్సలు నప్పవు అనుకుంటారు. కానీ వెస్ట్రన్
దుస్తులకు మీదకు ఇప్పుడు మన వెడ్డింగ్ జ్యువెలరీనీ మ్యాచ్ చేయవచ్చు.
వెస్ట్రన్ కాక్‌టెయిల్
పార్టీలకు, ఈవెనింగ్ క్యాజువల్ డ్రెస్‌గా పేరొందింది. నల్లటి
మ్యాక్సీడ్రెస్. దీనికి మన వివాహవేడుకల సమయంలో ధరించే కుందన్ నెక్లెస్, చెవి
లోలాకులు అద్భుతమైన కాంబినేషన్‌గా అదరగొట్టేస్తాయి. గౌన్ వి నెక్‌లో ఉంటే దానికి
రాణిహారం వేసి, పైన కుందన్ నెక్లెస్ ధరించవచ్చు.
వివాహవేడుకలకు ధరించే మీనకారి చెవి జూకాలు కూడా ఈ వెస్ట్రన్‌డ్రెస్
మీదకు బాగా నప్పుతాయి. వెస్ట్రన్ పార్టీలలో నలుపు ఎలాగో తెలుపు డ్రెస్ కూడా అంత
అద్భుతమైన అందంతో తళుక్కుమంటుంది. తెల్లటి డ్రెస్ వేసుకుంటే దానిమీదకు పోల్చి
నెక్లెస్, పెద్దపెద్ద బంగారుగాజులు వేసుకుంటే ఇండోవెస్ట్రన్
కలయికతో అద్భుతమైన లుక్‌ని తీసుకురావచ్చు.
సంప్రదాయ లెహంగా చోలీ
డ్రెస్సుల మీదకు ఉపయోగించే ఆక్సిడైజ్డ్ సిల్వర్ గాజులు, నెక్లెస్, జూకాలు, నెక్లెస్
వంటివి జీన్స్-వైట్ షర్ట్‌మీదకు మాక్సీ డ్రెస్సుల మీదకు సరైన ఎంపిక అవుతుంది.
వివాహవేడుకల్లో వేళ్లను-మణికట్టును కలుపుతూ ఉండే హాత్‌పూల్ ఆభరణం
పాశ్చాత్యదుస్తులకు భిన్నమైన లుక్ తీసుకువస్తుంది.
డిన్నర్ పార్టీకి
పొడవాటి చేతులున్న టాప్స్, స్ట్రాప్స్ బ్లౌజ్‌లు ధరించినప్పుడు హాత్‌పూల్‌ను
అందంగా అలంకరించుకోవచ్చు. వివాహ వేడుకల కోసం బంగారు హారాలు తీసుకుంటారు. ఇవి మళ్లీ
సంప్రదాయ చీర, లెహం గాల మీదకే బాగుంటాయను కుంటే పొరపాటు. టర్టిల్‌నెక్, కాలర్‌షర్ట్స్, డీప్‌నెక్
టాప్స్ ధరించినప్పుడు ఒకటికి మూడు వరుసలు ఉన్నవి, పచివర్క్ హార లు కూడా
ధరించవచ్చు.