సులభమైన మేకప్ చిట్కాలు
By: Sankar Tue, 23 June 2020 3:20 PM
అందంగా కనిపించాలని స్త్రీలు ఎంతో ఇష్టపడుతారు. అందుకోసం ఎంత సమయాన్నైనా కూడా వెచ్చిస్తారు. కానీ కొంతమంది అమ్మాయిలు సులభమైన బ్యూటీ టిప్స్‌తో మేకప్ వేగంగా పూర్తి చేయాలనుకుంటారు. ఈ తరహా అమ్మాయిల కోసం సులభమైన కొన్ని బ్యూటీ టిప్స్..
1. ఈరోజుల్లో బయటకు వెళ్లేప్పుడు మహిళలు లిప్ స్టిక్ వేసుకోవడం సర్వ సాధారణం అయితే కొంచెం సేపు తర్వాత ఆ లిప్ స్టిక్ ఆరిపోతుంది ..అయితే లిప్‌స్టిక్ వేసుకునేందుకు ముందుగా పెదాలపై కొద్దిగా ఫౌండేషన్ అద్దుకుంటే పెదాలపై వేసుకున్న లిప్‌స్టిక్ రంగు రోజంతా తాజాగా ఉంటుంది.
2 యుక్త వయస్సు వచ్చిన తర్వాత యువతీ యువకుల్లో సాదరణంగా వేదించే సమస్య మొటిమలు అయితే మొటిమలు ఎర్రగా అయ్యి ఇబ్బంది పెడుతుంటే రాత్రి నిద్రపోవడానికి ముందు మొటిమ మీద కొద్దిగా టూత్‌పేస్ట్‌ను అద్దితే మొటిమకున్న ఎర్రదనం, వాపు తగ్గుతాయి.
3. వ్యాయామం అనంతరం ముఖం ఎర్రగా కందిపోతే ఆ ప్రాంతంలో రెండు నిమిషాల పాటు ఐస్‌కోల్డ్ టవల్ ఉంచాలి. ఇలా చేయడం వలన కందిపోయిన ముఖంలోని ఎరుపుదనం తగ్గుతుంది.
4. బయటకు వెళ్లేటప్పుడు బేబీ ఆయిల్‍ను కొద్దిగా జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు మెరుస్తాయి.
5. ఐ లైనర్ పెట్టుకుంటే కళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి అయితే ఐ లైనర్ తొందరగా విరిగిపోకుండా ఉండాలంటే , ఐ లైనర్ ను 10-15 నిమిషాలు ఫ్రీజర్‌లో ఉంచితే దాన్ని వాడేటప్పుడు తొందరగా విరగదు.