Advertisement

కళ్ళు ఆకట్టుకునేలా డిజైనర్ బ్లౌజ్‌లు

By: chandrasekar Mon, 01 June 2020 10:27 PM

కళ్ళు ఆకట్టుకునేలా డిజైనర్ బ్లౌజ్‌లు


పెళ్లి కూతురు పట్టుచీరకు తగినట్లుగా బ్లౌజ్‌లుండాలి కదా! పెళ్లి కూతురు చీర అనగానే మనమదిలో కంచిపట్టు పేరు మెదులుతుంది. కంచిపట్టు అందం రెట్టింపులుగా కనిపించా లంటే ఎంచుకున్న బ్లౌజ్‌ డిజైన్‌ ప్రత్యేకంగా ఉండాలి. ఒక్క కంచిపట్టుచీరకే కాదు ఇతర వేడుకల్లో ధరించేందుకు ఆకట్టుకునే లుక్‌ ఉండాలంటే చీరకు తగినట్టుగా బ్లౌజ్‌ ఉండాల్సిందే. వివాహం అయిపోయిన తర్వాత జరిగే సత్యనారాయణ వ్రతం, బంధువుల ఇండ్లలో జరిగే విందుభోజనాల సమయంలో నూతన వధువు ధరించే దుస్తులపైనే అందరి కళ్లుంటాయి.

ఖరీదైన చీరలకు తగినట్టుగానే బ్లౌజ్‌ డిజైన్లు కూడా ఉన్నప్పుడే ఆ చీరకు రెట్టింపు అందం వస్తుంది. కలర్‌ కాంబినే షన్‌ సరిగ్గా కుదరాలి. అందుకు వేల డిజైన్లను పరిశీలిస్తారు. లేదంటే, గ్రాండ్‌గా కనిపించాలని బ్లౌజ్‌ అంతా ఎంబ్రాయిడరీ వర్క్‌తో నింపేస్తారు. పెళ్లి చీరకు తగిన బ్లౌజ్‌ మ్యాచ్‌ చేసుకునేలా మన దగ్గరే సరైన సమాధానం ఉంటే ఎంపిక ఇంకా సులువు అవుతుంది. బ్లౌజ్‌పై ఎలాంటి వర్క్‌ అయితే బాగుంటుందో చెప్పడానికి ముందు చీరలో ఉన్న డిజైన్‌, కలర్‌ కాంబినేషన్స్‌ చూసుకుంటాం. ఆ చీరపై ఉన్న థీమ్‌ డిజైన్‌ బ్లౌజ్‌పై ఎలా చూపుతామో కస్టమర్‌కి ఒక స్టోరీలా వివరంగా చెబుతాం. దీంతో ఆ బ్లౌజ్‌ డిజైన్‌ మరెక్కడా లేనివిధంగా రూపుదిద్దుకుంటుంది.

ఒకసారి వాడి ఆరేడేళ్ల తర్వాత ఆ బ్లౌజ్‌ను బయటకు తీస్తే ఈ వర్క్‌ ఇప్పుడు ట్రెండ్‌లో లేదు అనే ఫీల్‌ ధరించినవారికి రాకూడదని కోరుకుంటారు. పెళ్లి అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకువచ్చే కామన్‌ కలర్స్‌ ఎరుపు, నీలం, పచ్చ, పింక్‌, గోల్డ్‌. సాధారణంగా బ్లౌజ్‌లు ఎంచుకునేటప్పుడు మూడురకాలుగా ఆలోచిస్తాం.

* శారీ కలర్‌లోనే ఉండేది

* పూర్తి కాంట్రాక్ట్‌

* అన్నింటికీ వాడే గోల్డ్‌ కలర్‌

designer,blouses,to,impress,eyes ,కళ్ళు, ఆకట్టుకునేలా, డిజైనర్, బ్లౌజ్‌లు, పెళ్లి


పెళ్లి కూతురు బ్లౌజ్‌ అయితే చీరకు కాంట్రాస్ట్‌ కలర్‌ ఎంచుకుంటాం. లేదంటే గోల్డ్‌ ఆలోవర్‌ వర్క్‌ తీసుకుంటాం. మేనిరంగును బట్టి తెల్లగా ఉండేవారు కాంతిమంతమైన రంగులు, రంగు తక్కువ ఉన్నవారు లేతరంగు చీరలు అని ఎంపిక చేసుకుంటారు. కొందరు చామనచాయగా ఉన్నా బ్రైట్‌ కలర్స్‌ ధరించాలనుకుంటారు. వీళ్లు ముదురు రంగు చీరలు ఎంచుకున్నప్పుడు కొద్దిగా లేతరంగు బ్లౌజ్‌ను మ్యాచ్‌ చేసుకోవాలి. దీనివల్ల ఆ కలర్‌ ముదురురంగు చీరలు ఎంచుకున్నప్పుడు కొద్దిగా లేతరంగు బ్లౌజ్‌ను మ్యాచ్‌ చేసుకోవాలి. దీనివల్ల ఆ కలర్‌ ఫేస్‌ మీద ప్రతిబింబిస్తుంది.

చీరలో జరీ డిజైన్‌ శాతం ఎక్కువ ఉంటే బాగా బ్రైట్‌ కలర్‌ బ్లౌజ్‌ తీసుకోవాలి. కంచిపట్టులో కలర్‌ ఎక్కువ ఉంటే దానిని కాస్త డల్‌ చేయడానికి బ్లౌజ్‌లో ఎక్కువ వర్క్‌ తీసుకోవాలి. పెద్దబార్డర్‌ చీరలకు మోచేతుల వరకు స్లీవ్స్‌ బాగుంటాయి. చిన్న బార్డర్‌ అయితే మోచేతుల వరకు చేతుల డిజైన్‌ పాటు కొంత కుచ్చులు వచ్చేలా డిజైన్‌ చేయించుకోవచ్చు. లేదంటే అంచు పెద్దగా ఉంటే మోచేతుల వరకు అంచుతోనే డిజైన్‌ చేసుకోవచ్చు. వీటి మీద సింపుల్‌ డిజైన్‌ చేయించుకోవచ్చు. పొడవు తక్కువ ఉన్నవారు మోచేతుల వరకు స్లీవ్స్‌, లైన్స్‌ వచ్చేలా ఎంబ్రాయిడరీ, కరెక్ట్‌ ఫిటింగ్‌తో ఉంటే పొడుగ్గా కనిపిస్తారు.

designer,blouses,to,impress,eyes ,కళ్ళు, ఆకట్టుకునేలా, డిజైనర్, బ్లౌజ్‌లు, పెళ్లి


బాడీ పార్ట్‌కి ఒక కలర్‌, స్లీవ్స్‌కి మరో కలర్‌ ఫ్యాబ్రిక్‌ తీసుకున్నా పొడవు కనిపిస్తారు. వీళ్లు బ్లౌజ్‌ లెంగ్త్‌ పొట్టిగా ఉండాలనుకోకూడదు. సాధారణ పొడవు, డీప్‌నెక్స్‌ బాగుంటాయి. భుజభాగం సన్నగా ఉంటే లేయర్డ్‌ బ్లౌజ్‌ వేసుకుంటే వెడల్పుగా కనిపిస్తారు. ఎంబ్రాయిడరీ ఎంత చేయించుకుంటే అంత గ్రాండ్‌గా కనిపిస్తాం అనుకుంటారు చాలామంది. అది సరైనది కాదు. బ్లౌజ్‌ డిజైన్‌కి జరీ తక్కువ గ్లిట్టర్‌ ఉన్నది వాడాలి. కానీ, వేసుకున్నప్పుడు వర్క్‌షైన్‌ అవ్వాలి, చిన్న నెక్‌లైన్‌, ఆలోవర్‌ వర్క్‌ అయినా డిజైన్‌ని శారీలోంచి తీసుకుంటే ఎక్కడా కాపీ కాదు.

కంచిపట్టు చీరలోనే ప్యూర్‌ టిష్యూ ప్లెయిన్‌బ్లౌజ్‌ పార్ట్‌ ఉంటుంది కాబట్టి దీంతో హైనెక్‌ ఇచ్చి లాంగ్‌ స్లీవ్స్‌తో డిజైన్‌ చేయించుకోవచ్చు. అయితే అప్పుడు ధరించే నగలు ప్రత్యే కంగా ఉండాలి. ప్రత్యేకమైన జ్యువెలరీ ఉన్న ప్పుడు బ్లౌజ్‌కి ఎంబ్రాయిడరీ హంగులు అక్కర్లేదు. స్పెషల్‌ జ్యువెలరీ లేదనుకున్నప్పుడు కంచిపట్టుకు ప్లెయిన్‌ బ్లౌజ్‌ సెట్‌ అవ్వదు.

Tags :
|

Advertisement