Advertisement

ఆడవాళ్లకు అందమైన ముక్కుపోగు

By: chandrasekar Wed, 26 Aug 2020 8:39 PM

ఆడవాళ్లకు అందమైన ముక్కుపోగు


ఆడవాళ్లకు మరింత అందాలను చేకూర్చేది అందమైన ముక్కుపోగు. కొందరైతే మరీ ఇష్టపడి ముక్కుపోగు పెట్టుకుంటారు. శాస్త్రియ పరంగా ముక్కు పొడుచుకోవడం వల్ల అనేక లాభాలు వుంటాయని చెప్పబడతాయి. పొందికైన ముక్కుకు ఒక్క లోహపు పోగు తగిలిస్తే ముఖంలోని అందమంతా అక్కడే పోగు పడుద్ది. నచ్చిన మగ హృదయాన్ని కొల్లగొట్టాలంటే, ముక్కెర పెట్టిన ముక్కే ఎర. అందుకే దాన్ని ముక్కెర అన్నారేమో. ఎప్పుడూ పోష్ గా కనిపించే మన హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడూ ఒక సినిమాలోనో, ఒక పాటలోనో ముక్కుకు ముక్కెరతో కనిపించి యువహృదయాలకు గిలిగింతలు పెడతారు.

ఆయుర్వేదం ప్రకారం ముక్కు భాగంలోని నరాలను శాంత పరచడానికి మహిళలు ముక్కుపుడకలు ధరిస్తారని చెబుతారు. మహిళలు ప్రసవించే సమయంలో పురిటినొప్పులు ఎక్కువగా లేకుండా సుఖప్రసవం కావడానికి ముక్కుపుడక సహాయపడుతుందని పెద్దలు చెబుతుంటారు. ముక్కు కుట్టడం ద్వారా మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుందనే విషయాన్ని కూడా బామ్మలు చెబుతుంటారు. ఎడమవైపు ముక్కు పుడక ధరించడం వల్ల ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయి. అంతేకాదు కంటి, చెవినరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముక్కు కుట్టించుకోవడం వల్ల చెవిపోటు వంటివి దరిచేరవు. నేడు ముక్కుపుడక అనేది కేవలం ఆచారంగానే కాకుండా ఫ్యాషన్‌గా కూడా మారిపోయింది.

beautiful,nose,ring,for females,fashion ,ఆడవాళ్లకు, అందమైన, ముక్కుపోగు,  ముక్కు భాగంలోని, నరాలను


అసలు ముక్కుపోగు అనగానే దానికి బ్రాండ్ అంబాసిడర్ అనదగ్గ అమ్మాయి టెన్నీస్ స్టార్ సానియా మీర్జా. తనతోనే ఈ మధ్య అమ్మాయిల్లో ముక్కుపోగుకు క్రేజ్ ఏర్పడింది. కాన్స్ ఫెస్టివల్ లో విద్యాబాలన్, సోనం కపూర్ లాంటి వాళ్ళు ముక్కెరతో మెరిసి, ప్రపంచ ఫోటోగ్రాఫర్లను ఆకట్టుకున్నారు. సోనాక్షీ సిన్హా నుండి నయనతార, శ్రీయ, సమంతా వరకు ఒక్కో సినిమాలో ముక్కెరతో కనిపించి అందాలు చిందించిన వారే. ఇక ఐటమ్ సాంగ్స్ వద్దకు వస్తే, ఈ మధ్యే వచ్చిన బాహుబలి సినిమాలో సైతం, మన హాట్ భామలు అంతా ఈ ముక్కెరలతో మురిపించిన వారే. స్త్రీ అలంకరణలలో ముక్కెరకు అంత ప్రత్యేకత ఉంది.

ఒక్కొక్క ముక్కూ ఒక్కోలా ఉంటుంది. దేని ప్రత్యేకత దానిదే. దేని అందం దానిదే. కొందరివి సన్నగా పొడుగ్గా కొసదేరి ఉంటాయి. చివర కొంచెం వంగి ఉండే ముక్కును కోటేరేసిన ముక్కు అంటాం. కొన్ని చిలుక ముక్కులు. కొన్ని వెదురు బొంగులు. కొన్ని చప్పిడి ముక్కులు. కొన్ని జయప్రద ముక్కులు. కొన్ని శ్రీదేవి పదహారేళ్ళ నాటి గుండ్రటి ముక్కులు. కొన్ని ఇలియానా లాంటి కత్తి ముక్కులు, కొన్ని సమంతా లాంటి పొట్టి ముక్కులు. ప్రియాంకా గాంధీ నుండి దీపికా పడుకోన్ వరకు ప్రతి ముక్కుకూ ఒక్కో ప్రత్యేకత ఒక్కో ముక్కుకూ వేరు వేరు అభిమానులు.

beautiful,nose,ring,for females,fashion ,ఆడవాళ్లకు, అందమైన, ముక్కుపోగు,  ముక్కు భాగంలోని, నరాలను


హస్త సాముద్రికంతో చేతిని చూసి భవిష్యత్తు చెప్పినట్టే, ముక్కును చూసి విషయం చెప్పే నాసికా సాముద్రికం కూడా ఉందంట. శతావధాని సి.వి. సుబ్బన్న గారు ముక్కు సాముద్రికాన్ని ఇలా చెప్పారు. పొడుగైన ముక్కున్న అమ్మాయి తను కోరుకున్న వాడిని పొందుతుంది. నిజమే కదా! పొడుగు ముక్కున్న భామకు అభిమానులు ఎక్కువమంది ఉంటారు కాబట్టి, వాళ్ళలో తనకిష్టమైన వాడిని ఎంచుకోవచ్చు.

Tags :
|
|

Advertisement